War 2 Pre Release Event : పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2పై మంచి అంచనాలున్నాయి. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. తన 25 ఏళ్ల కెరీర్ గురించి మాట్లాడారు. ఈ కెరీర్ లో నాతో పాటు మీరందరూ నడిచారు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి నా కుటుంబం ఎంత కారణమో.. మీరూ అంతే కారణం. మనమందరం ఒక కుటుంబ సభ్యులం. నేను ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా అంటూ.. మైక్ పక్కన పెట్టేసి వంగి మరీ తన రెండు చేతులతో పాదాభి వందనం చేశాడు ఎన్టీఆర్.
Read Also : War 2 Pre Release Event : నన్ను ఎవ్వరూ ఆపలేరు.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్
నా తాత ఆశీస్సులు నాతో ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు. నా తండ్రి నాకు జన్మనిచ్చారు. కానీ నా జన్మ మీకే సొంతం. జీవితాంతం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటా. మీరు కాలర్ ఎగరేసుకునేలా చేస్తా. మూవీకి వెళ్లండి. అందరూ ఎంజాయ్ చేయండి. చాలా కష్టపడి సినిమా తీశాం. ఈ సినిమాలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. వాటిని ఎవరికీ చెప్పకండి. మళ్లీ సక్సెస్ మీట్ లో కలుద్దాం అంటూ తెలిపారు ఎన్టీఆర్.
Read Also : WAR 2 Pre Release Event : ఎన్టీఆర్ నాకు తమ్ముడు.. సింగిల్ టేక్ యాక్టర్.. హృతిక్ ప్రశంసలు