ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం
రాష్ట్రపతి భవన్లో 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ, బీజేపీ మిత్ర పక్ష ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలంతా హాజరయ్యారు. అలాగే మాజీ ఉప రాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, జగదీప్ ధన్కర్ దంపతులు, తదితరలంతా హాజరయ్యారు. సెప్టెంబర్ 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా.. ప్రతిపక్ష అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. దాదాపు 152 ఓట్లతో రాధాకృష్ణన్ విజయం సాధించారు.
మిరాయ్ vs కిష్కింధపురి.. విన్నర్ ఎవరంటే.?
ఈ సెప్టెంబర్ 12న రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనే రీతిలో పోటీపడుతున్నారు. అందులో ఒకటి తేజ సజ్జా – మంచు మనోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న మిరాయ్. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసుకుని మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లోకి వస్తోంది. అశోకుడు.. 9 పుస్తకాలు.. నేపధ్యంలో మైథలాజికల్ టచ్ తో వచ్చాయి మిరాయ్. ఇక రెండవ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న కిష్కిందపురి. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ దెయ్యంలా కనిపించబోతున్న ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. రెండు సినిమాలు ప్రీమియర్స్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ రాబట్టాయి. అయితే ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు ఎక్కువ మార్కులు అంటే.. కిష్కింధపురి హారర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన సినిమా అందుకు తగ్గట్టే ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. కథ, కథనం అన్ని చక్కాగా కుదిరాయి. మ్యూజిక్, విజువల్స్ మెప్పిస్తాయి. లీడ్ రోల్స్ పర్ఫామెన్స్ సూపర్బ్. ఇక మిరాయ్ చూసుకుంటే మైథలాజికల్ టచ్ తో టెక్నికల్ గా విజువల్ వండర్ గా అనిపించింది. కథ బాగున్నా కధనం కాస్త నెమ్మదించింది. ఇకఈ రెండు సినిమాలలో విన్నర్ అంటే హారర్ జానర్ ఇష్టపడే వారికీ కిష్కింధ సూపర్బ్ గా ఉంటుంది. మైథాలజీకల్ ఆడియెన్స్ కు మిరాయ్ అదురుతుంది. ఓవరాల్ గా ఈ వారం రెండు సినిమాలు విజేతలుగా నిలిచాయి. రెండు ఫ్యామిలీతో కలిసి చూసే మంచి సినిమాలు.
విజయవాడలో డయేరియా విజృంభణ.. 100 దాటిన కేసులు!
విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే బాధ్యతల సంఖ్య 100 దాటింది. గత రాత్రి 30 మంది వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ చేయించుకున్నారని తెలుస్తుంది. అందులో దాదాపు సగానికి పైగా డిస్చార్జ్ ఆయారు. ఆసుపత్రికి వచ్చిన వాళ్ళందరూ కూడా నీరసం, వాంతులు విరోచనాలతో వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారందరికీ కొత్త రాజరాజేశ్వరిపేటలోనే మొత్తం మూడు వార్డులుగా ఏర్పాటు చేసి వార్డుకు ఆరు నుంచి ఏడు బెడ్ల వరకు కూడా ఏర్పాటు చేసి.. అంటే దాదాపు 20 బెడ్ల వరకు కూడా అందుబాటులో ఉండేలాగా స్థానికంగా ఏర్పాటు చేసారు అధికారులు. మరోవైపు మందులు కూడా తీసుకొచ్చి ఇక్కడే ఉంచి బాధితులకు వెంట వెంటనే మెడిసిన్ అందించేందుకు కూడా ఏర్పాటులు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా 34 బెడ్లతో ఒక వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇంకొక వార్డును కూడా 24 బెడ్లతో ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ఇంకా ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ ఏరియాలో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి అనేది కూడా పరిశీలించడానికి స్థానికంగా కూడా సర్వే చేస్తున్నారు అధికారులు.
రాష్ట్రంలో వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దూకుడుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరంలో వందలాది పాత ఇళ్లు ఇంకా వాడుకలో ఉన్నాయి. ఈ ఇళ్లు వర్షాల కారణంగా కూలిపోయే ప్రమాదం ఉండటంతో, అక్కడ నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే తాత్కాలిక ఆశ్రయం కల్పించేలా పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోకుండా అధికారులు ముందుగానే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ప్రమాదం తలెత్తే అవకాశమున్న ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
మద్యం మత్తులో లవర్‌తో బెట్టింగ్.. సముద్రంలోకి కారు.. చివరకు?
ఈ మధ్యకాలంలో కొందరు యువత పబ్లిక్ లో కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎక్కువ అయిపోయింది. కొంతమంది యువతీ యువకులు చుట్టుపక్కల ఏమి జరుగుతున్న పట్టించుకోకుండా పబ్లిక్ లోనే సరసాలు కాని చేస్తున్న సంఘటనలు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తన ప్రియురాలితో, స్నేహితులతో మద్యం మత్తులో బెట్టింగ్ వేశాడు ఓ యువకుడు. ఇందులో భాగంగా యువకుడు కారును సముద్రంలోకి తీసుకువెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. కడలూర్ హార్బర్ – పరంగిపేట తీరప్రాంతం వద్ద సముద్రంలోకి ఎవరు కారు నడుపుతారని బెట్టింగ్ వేసుకున్నారు చెన్నై చెందిన ఐదుగురు యువకులు. దానితో గూగుల్ మ్యాప్ పెట్టుకుని మద్యం మత్తులో ఓ యువకుడు తాను వెళ్లి చూపిస్తానని లవర్ తో సవాల్ చేసి కారుని సముద్రంలోకి తీసుక వెళ్ళాడు. కడలూర్ సమీప సోధికుప్పం వద్ద కారులోని నలుగురిని రోడ్డుపై దించిన యువకుడు కారును మ్యాప్ చూస్తూ సముద్రంలోకి పోనిచ్చాడు.
ఒక్క వీడియో కాల్.. మొత్తం జీవితం తలకిందులు.!
సైబర్ నేరగాళ్ల కొత్త తరహా బ్లాక్మెయిల్ ఉదంతం హైదరాబాద్‌లో కలకలం రేపింది. నగరానికి చెందిన ఓ LIC ఉద్యోగిని టార్గెట్ చేసి, నాలుగు రోజులుగా నరకం చూపిస్తున్నారు. పోర్న్ వీడియోల కేసులో ఇరుక్కున్నావంటూ భయపెట్టి, బ్యాంక్ వివరాలతో పాటు, భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులమని చెప్పి వీడియో కాల్స్ చేసి బెదిరింపులకు దిగడం ఈ కేసులో మరింత ఆందోళన కలిగించే విషయం. సంఘటన వివరాల్లోకి వెళ్తే, సదరు LIC ఉద్యోగికి కొన్ని రోజుల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను “క్రైమ్ బ్రాంచ్” పోలీసునని పరిచయం చేసుకున్నాడు. ఆ ఉద్యోగి వాట్సాప్ నెంబర్ ద్వారా “అశ్లీల వీడియోలు” షేర్ అయ్యాయని, దీనిపై తీవ్రమైన కేసు నమోదైందని బెదిరించాడు. ఈ కేసులో వెంటనే జైలుకు వెళ్లే అవకాశముందని, అరెస్ట్ కాకుండా ఉండాలంటే వెంటనే బ్యాంక్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.
కరుగుతున్న ‘మంచు’.. మనోజ్ సినిమాకు విష్ణు స్పెషల్ విషెష్
మంచు కుటుంబంలోని తండ్రికొడుకుల మధ్య కొన్ని నెలల క్రితం నెలకొన్న వివాదం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. మరి ముఖ్యంగా మోహన్ బాబు వారసులైన మంచు విష్ణు – మంచు మనోజ్ లు తమ అనుచరులతో కలిసి ఇంతటి రచ్చ చేసారో. ఒకరిపై ఒకరు దాడులు, కేసులు వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. కానీ ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఈ వివాదం సైలెంట్ అయింది. మంచు ఫ్యామిలీలో ఈ వివాదం నడుస్తున్నపుడే మంచు విష్ణు, మోహన్ బాబు నటించిన కన్నప్ప రిలీజ్ అయింది. ఆ టైమ్ లో తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో టీమ్ కు విషెష్ తెలియజేసాడు మనోజ్. అలాగే వ్యక్తిగత కక్షలు పక్కన పెట్టి మరి మంచు మనోజ్ ఈ సినిమాను స్వయంగా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి కన్నప్ప టీమ్ పై ప్రశంసలు కురిపించాడు. అసలు క్లైమాక్స్ లో అంత బాగా నటిస్తాడని అనుకోలేదని పరోక్షంగా అన్న విష్ణునుద్దేశించి వ్యాఖ్యానించాడు. అప్పట్లో ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇప్పుడు మంచు మనోజ్ విలన్ గా నటించిన మిరాయ్ ఈ రోజు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మిరాయ్ టీమ్ కు Wishing all the best for Mirai. God speed to the entire team. అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసాడు విష్ణు. పగలు, పంతాలు, మొహమాటాలు ఇవన్నీ తాత్కాలికం. అన్నదమ్ముల ప్రేమ అన్నిటికంటే ముఖ్యం అని మీరు ఇలానే కలిసి ఉండాలని విష్ణుకి మంచు ఫ్యాన్స్ థాంక్స్ చెప్తూ రిప్లై ఇస్తున్నారు.
లిక్కర్ స్కామ్ కేసు.. నేటితో ముగియనున్న రిమాండ్.. బెయిల్ వస్తుందా?
లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. దానితో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరచడానికి తీసుకుని వెళ్లుతున్నారు. ఎస్కార్ట్ సిబ్బంది, ఏసీబీ పోలీసులు ప్రత్యేక వాహనంలో రాజమండ్రి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి రిమాండ్ నేటితో ముగియనుంది. రిమాండ్ పొడిగింపు నిమిత్తం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరచడానికి ఆయన తీసుకుని బయలుదేరారు పొలిసు అధికారులు.
రాష్ట్ర ప్రభుత్వం చొరువతో స్వస్థలాలకు చేరుకున్న తెలుగు ప్రజలు!
నేపాల్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న తెలుగు ప్రజలు ప్రభుత్వం చొరువతో స్వస్థలాలకు చేరుకున్నారు. తాము అక్కడ ఉన్నన్ని రోజులు భయం భయంగా గడిపామని.. రోడ్లపై రాడ్లు, ఇతర ఆయుధాలతో ఆందోళనకారులు తిరుగుతున్నారని తెలుగు యాత్రికులు తెలిపారు. మరవైపు రాష్ట్రానికి చేరుకున్న యాత్రికులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు. జన్ జెడ్ ఆందోళనలో భాగంగా నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. అక్కడి రాయబార కార్యాలయం అధికారులతో, విదేశాంగ శాఖ ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు ఆయా నగరాల్లో చిక్కుకున్న వారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కుల ధ్రువీకరణ పత్రాల జారీకి కొత్త విధానం
రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్లు పొందడానికి దరఖాస్తు చేసి, ఎమ్మర్వో ఆమోదం కోసం వేచి చూడాల్సి వచ్చేది. ఎమ్మర్వో అందుబాటులో లేకపోతే లేదా ఇతర పరిపాలన సమస్యల వల్ల ఈ ధ్రువీకరణ పత్రం కోసం వారం నుంచి రెండు వారాల వరకు సమయం పట్టేది. ఈ జాప్యాన్ని తొలగించి ప్రజలకు తక్షణ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఇకపై బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు నేరుగా తమ సమీపంలోని మీ సేవ కేంద్రాల నుంచే కుల ధ్రువీకరణ పత్రాలను పొందగలరు. ఈ కొత్త విధానం గత 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు.