బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రస్తుతం ‘ధురంధర్’ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా అదరగొట్టడంతో, రణవీర్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దీనికి కొనసాగింపుగా వచ్చే ‘ధురంధర్ 2’ కూడా ఈ మార్చిలోనే రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో ఆయన సౌత్ ఇండియన్ దర్శకులతో సినిమాలు చేయబోతున్నారనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రణవీర్‌తో ఒక భారీ యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నారని, అలాగే తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తన ‘వేల్పారి’ ప్రాజెక్టులో రణవీర్‌ను ఒక హీరోగా తీసుకోవాలనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
Also Read : Thiruveer : నిర్మాతల మాయమాటలు నమ్మి మోసపోతున్నాను: తిరువీర్ ఆవేదన.
అయితే, ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయా లేదా అన్నది చూడాలి.. ఎందుకంటే రణవీర్ సింగ్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటున్నారు. గతంలో ప్రశాంత్ వర్మతో చేయాల్సిన ‘రాక్షస్’ సినిమా చివరి నిమిషంలో ఆగిపోయింది. అలాగే శంకర్‌తో చేయాల్సిన ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ కూడా వెనక్కి వెళ్లిపోయింది. రణవీర్ ప్రస్తుతం ‘ధురంధర్ 2’ ఫలితం కోసం చూస్తున్నారని, అది హిట్ అయితే పార్ట్-3 పైనే ఫోకస్ పెడతారని తెలుస్తోంది. కాబట్టి ఈ సౌత్ ప్రాజెక్టులపై రణవీర్ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఇవన్నీ కేవలం పుకార్లుగానే మిగిలిపోయే ఛాన్స్ ఉంది.