టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణను ప్రారంభించిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద ఈ కేసులో ఈడీ సినీ రంగానికి చెందిన 12 మంది ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇక ఈ రోజు నటి చార్మి ఈడీ విచారణకు హాజరైంది. కాగా, సెప్టెంబర్ 6న రకుల్‌ప్రీత్ సింగ్ హాజరు కావాల్సివుండగా.. ఆమె హాజరుపై సందిగ్ధత నెలకొంది.
రకుల్‌ప్రీత్ సింగ్ కు సెప్టెంబర్ 6న విచారణకు హాజరుకావాలంటూ ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే అనివార్య కారణాల వల్ల 6న విచారణకు హాజరు కాలేనంటూ ఈడీ అధికారులకు రకుల్ సమాచారం పంపింది. కాగా, రకుల్ ఉద్దేశపూర్వకంగానే రాలేకపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె రాలేకపోతుందనడానికి బలమైన కారణాలు లేకపోవడంతో మరోసారి ఆమెకు నోటీసులు అంతే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా రకుల్ ను మరో తేదీన హాజరుకావాల్సిందిగా కూడా ఈడీ నోటిస్ చేసే అవకాశం కనిపిస్తోంది.