Pavitra Lokesh:టాలీవుడ్ లో ప్రస్తుతం పవిత్రా లోకేష్ గురించి తెలియని వారుండరు. నటుడు నరేష్ తో ఆమెకు ఎఫైర్ ఉందంటూ వార్తల్లో నిలిచి ఫేమస్ అయ్యింది. ఇక వారిద్దరి మధ్య రిలేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎఫైర్ ఉందో లేదో పక్కన పెడితే ఈ వివాదంతో పవిత్రాకు మాత్రం మంచే జరిగిందని చెప్పుకొస్తున్నారు. ఆమె ఫేమస్ అవ్వడంతో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయట. ఇక ఇటీవలే ఆమె క్రేజ్ ఎలా ఉందో రామారావు ఆన్ డ్యూటీ థియేటర్ లో చూడాలి. రవితేజ కనిపించినా కూడా అరవని వాళ్లు పవిత్రా, నరేష్ కనిపించేసరికి అరుపులు, కేకలతో హోరెత్తించారు. దీంతో అమాంతం ఈ సీనియర్ నటి పారితోషికాన్ని పెంచేసింది.
ఇక ఈ నేపథ్యంలోనే పవిత్రా లోకేష్ గురించి న ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. సెట్ లో ఒక స్టార్ హీరో ఆమెను ఘోరంగా అవమానించాడట. ఒక స్టార్ హీరో నటించే సినిమాలో పవిత్రా అతనికి తల్లిగా నటించే అవకాశాన్ని అందుకున్నదట. అయితే ఈ విషయం తెలియని హీరో సెట్స్ లో రాగానే ఆమెను చూసి ఖయ్ మన్నాడట.ఆమెను తల్లిపాత్రకు ఎందుకు పెట్టారంటూ డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడని, అందుకు ఆమె నొచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత..? ఆ స్టార్ హీరో ఎవరు..? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.