సి.అశ్వనీదత్… ఒక్కరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో ప్రఖ్యాత నిర్మాణసంస్థలుగా వెలుగు చూసిన వాటిలో ‘వైజయంతీ మూవీస్’ స్థానం ప్రత్యేకమైనది. మహానటుడు నటరత్న యన్.టి.రామారావు చేతుల మీదుగా ఈ సంస్థ ఆరంభమైంది. ఈ సంస్థాధినేత చలసాని అశ్వనీదత్ చిత్రసీమలో ప్రముఖస్థానం సంపాదించారు. యన్టీఆర్ అభిమానిగా ఆయనతోనే ‘ఎదురులేని మనిషి’ చిత్రం నిర్మించి, తమ వైజయంతీ మూవీస్ కు శ్రీకారం చుట్టారు అశ్వనీదత్. తరువాత నాటి టాప్ స్టార్స్ తోనూ తరువాతి తరం అగ్రకథానాయకులతోనూ చిత్రాలను నిర్మించి జనం మదిలో మరపురాని స్థానం సంపాదించారు అశ్వనీదత్. ప్రస్తుతం ఆయన కూతుళ్ళు చిత్రనిర్మాణంలో ఉన్నారు. వారికి తగిన సలహాలూ, సూచనలూ చేస్తూ అశ్వనీదత్ అభిరుచిగల చిత్రాలను నిర్మిస్తున్నారు. వారి కూతుళ్ళు నిర్మించిన చిత్రమే ఈ మధ్య కాలంలో జనాదరణ పొందిన ‘మహానటి’. ఈ సినిమా ద్వారా ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ కు దర్శకునిగా మంచి పేరు లభించింది. ఇక టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేశ్ జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచింది. ఈ విశేషాలు ఇప్పటి జనానికి తెలుసుకానీ, అశ్వనీదత్ చిత్రప్రయాణం మరింత విశేషంగా ఉంటుంది.
అశ్వనీదత్ తండ్రి సి.ధర్మరాజు ధనవంతులు. తనయుడి అభిరుచిని ఆయన ఎన్నడూ కాదనేవారు కారు. దాంతో సినిమారంగంలో అడుగు పెట్టి, చిత్రాలు నిర్మించాలని ఉందని తనయుడు అశ్వనీదత్ తెలుపగానే, ఆయన కూడా ప్రోత్సహించారు. తొలుత మిత్రుడు ఎ.ఆర్.ఎస్. శర్మతో కలసి సావరిన్ సినీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ‘ఓ సీత కథ’ నిర్మించారు దత్. ఆ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టింది. తన అభిమాన నటుడు యన్టీఆర్ ను కలసి ఆయనతో సినిమా తీస్తానని పట్టు పట్టారు దత్. కుర్రాడిలో ఉత్సాహం ఉందనుకున్న యన్టీఆర్ సరే అన్నారు. సొంత బ్యానర్ పేరు రామారావునే సూచించమన్నారు దత్. యన్టీఆర్ సూచించిన ‘వైజయంతీ’ పేరునే బ్యానర్ గా పెట్టుకొని తొలి ప్రయత్నంలో యన్టీఆర్ హీరోగా కె.బాపయ్య దర్శకత్వంలో ‘ఎదురులేని మనిషి’ నిర్మించారు. ఆ చిత్రం వసూళ్ళ వర్షం కురిపించి, దత్ నిర్మాతగా నిలదొక్కుకొనేలా చేసింది. తరువాత యన్టీఆర్ తోనే ‘యుగపురుషుడు’ నిర్మించారు. తరువాత ఇతర హీరోలతో సినిమాలు తీయండి, మీకు మంచి భవిష్యత్ ఉందన్నారు యన్టీఆర్. ఆయన చెప్పిన తరువాతే దత్ ఇతర హీరోలతో చిత్రాలు నిర్మించడం మొదలు పెట్టారు. తన బ్యానర్ లోగోలో ‘శ్రీకృష్ణావతారం’లో యన్టీఆర్ విజయశంఖారావం చేసే బొమ్మనే పెట్టుకున్నారు దత్.
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
యన్టీఆర్ తో రెండు చిత్రాలు తీసిన అశ్వనీదత్ ఏయన్నార్ తో “గురుశిష్యులు, బ్రహ్మరుద్రులు” నిర్మించారు. ఈ రెండు చిత్రాలలో వేరే హీరోలు కూడా ఉన్నారు. కృష్ణ, కృష్ణంరాజుతో ‘అడవిసింహాలు’ తెరకెక్కించారు. కృష్ణతో సోలోగా ‘అగ్నిపర్వతం’ తీశారు. చిరంజీవితో “జగదేకవీరుడు-అతిలోకసుందరి, చూడాలనివుంది, ఇంద్ర, జై చిరంజీవా” చిత్రాలు నిర్మించారు. బాలకృష్ణతో ‘అశ్వమేధం’, అందులోనే శోభన్ బాబుతో ఓ కీ రోల్ పోషింపచేశారు. నాగార్జునతో “ఆఖరి పోరాటం, గోవింద గోవిందా, రావోయి చందమామా, ఆజాద్” తెరకెక్కించారు. వెంకటేశ్ తో ‘బ్రహ్మరుద్రులు, సుభాష్ చంద్రబోస్’ తీశారు. పవన్ కళ్యాణ్ తో ‘బాలు’, జూనియర్ యన్టీఆర్ తో “కంత్రి, శక్తి” చిత్రాలు నిర్మించారు. మహేశ్ బాబును హీరోగా పరిచయంచేస్తూ ‘రాజకుమారుడు’ తెరకెక్కించారు. ఆయనతోనే ‘సైనికుడు’ నిర్మించారు. రామ్ చరణ్ ను హీరోగా పరిచయంచేస్తూ ‘చిరుత’ రూపొందించారు. ఇలా టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ చిత్రాలు తెరకెక్కించారు సి.అశ్వనీదత్. వీటిలో కొన్ని బ్లాక్ బస్టర్స్ గానూ నిలిచాయి.
కేవలం వైజయంతీ మూవీస్ పతాకంపైనే కాకుండా స్వప్న సినిమా పతాకంపైనా ఆయన సినిమాలు నిర్మించారు. ఈ బ్యానర్ పై రూపొందిన ‘స్టూడెంట్ నంబర్ వన్’ ద్వారా రాజమౌళిని దర్శకునిగా పరిచయంచేశారు. ‘ఒకటో నంబర్ కుర్రాడు’తో తారకరత్నను హీరోని చేశారు. ‘ఎవడే సుబ్రమణ్యం’తో నాగ్ అశ్విన్ ను దర్శకునిగా నిలిపారు. ‘మహానటి’ చిత్రం కూడా ఇదే బ్యానర్ పై తెరకెక్కింది. ఈ మధ్య ఘనవిజయం సాధించిన ‘జాతి రత్నాలు’ కూడా ఈ పతాకంపైనే రూపొందింది.
త్రీ ఏంజెల్స్ అనే బ్యానర్ పై కూడా దత్, ఆయన కూతుళ్ళు చిత్రాలు నిర్మించారు. ఈ బ్యానర్ లో “బాణం, ఓం శాంతి, సారొచ్చారు” వంటి సినిమాలు రూపొందాయి. రాఘవేంద్ర మూవీ కార్పోరేషన్, సిరీ మీడియాఆర్ట్స్, యునైటెడ్ ప్రొడ్యూసర్స్ వంటి బ్యానర్స్ లోనూ అశ్వనీదత్ భాగస్వామిగా ఉన్నారు. ఈ సంస్థల ద్వారా వెలుగు చూసిన ‘పెళ్ళిసందడి’తో శ్రీకాంత్ స్టార్ హీరో అయ్యారు. ‘గంగోత్రి’తో అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యారు. శ్రీప్రియాంక పిక్చర్స్ అనే పతాకంపై ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో దత్ తెరకెక్కించిన ‘శుభలగ్నం’ మంచి విజయం సాధించింది. ఇలా అనేక మంది స్టార్స్ తో చిత్రాలు నిర్మించిన ఏకైక నిర్మాతగా సి.అశ్వనీదత్ తెలుగు చిత్రసీమలో నిలిచారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ, జనం మెచ్చే మరెన్నో చిత్రాలు నిర్మించాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
-
Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
-
ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్‌బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్‌లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!