ధమాకా, వాల్తేరు వీరయ్య జోష్‌లో వచ్చిన రవితేజ ‘రావణాసుర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టసింది. ఇప్పుడు ఆ లోటును పూడ్చేందుకు దసరా బరిలో సై అంటున్నాడు మాస్ మహారాజా. ఫస్ట్ టైం రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఆధారంగా తెరెక్కుతున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే దసరా రేసు నుంచి టైగర్ డ్రాప్ అవుతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే దసరా రేసులో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న ‘భగతవంత్ కేసరి’ మూవీ ఉంది.
Read Also: Salaar: పార్ట్ 1 రిలీజే రెండు సార్లు అంట మావా…
అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అలాగే కోలీవుడ్ నుంచి విజయ్ నటిస్తున్న ‘లియో’ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కాబోతోంది. దీంతో టైగర్ నాగేశ్వర రావు వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మేకర్స్ దృష్టికి వెళ్లడంతో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు. ‘ ముందుగా చెప్పిన ప్రకారమే టైగర్ నాగేశ్వర రావు సినిమాను అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నామనీ, రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి పుకార్లను నమ్మొద్దని’ మరోసారి అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. దీంతో బాలయ్యతో రవితేజ బాక్సాఫీస్ వార్ ఫిక్స్ అయిపోయినట్టే. లియో సినిమాను పక్కకు పెడితే తెలుగులో మాత్రం ఈ ఇద్దరి మధ్య జరగనున్న బాక్సాఫీస్ ఫైట్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది.