ధమాకా, వాల్తేరు వీరయ్య జోష్‌లో వచ్చిన రవితేజ ‘రావణాసుర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టసింది. ఇప్పుడు ఆ లోటును పూడ్చేందుకు దసరా బరిలో సై అంటున్నాడు మాస్ మహారాజా. ఫస్ట్ టైం రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఆధారంగా తెరెక్కుతున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరా…