MegaStar Chiranjeevi in Socio Fantasy Movie: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకు అంత మంచి రెస్పాన్స్ రాలేదు. ఎంతో ఆశగా సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ సినిమా కొంత నిరాశపరిచిందనే చెప్పవచ్చు. అయితే మెగాస్టార్ తరువాతి సినిమాల మీద అందరూ ఫోకస్ చేశారు. అయితే నిజానికి ఆయన తదుపరి మూవీ కుమార్తె నిర్మాణంలో తెరకెక్కాల్సి ఉంది. అయితే ఆ సినిమా కంటే 157 వ సినిమా మీద ప్రస్తుతం అందరి ద్రుష్టి నెలకొంది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ముందుగా మెగా 156 సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ మూవీ అని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు వశిష్టనే సోషల్ మీడియా వేదికగా వెళ్లడించారు. చిత్రబృందం చిరంజీవిని ఆయన నివాసంలో కలిసిన ఫోటోను షేర్ చేసిన వశిష్ట ప్రీ ప్రొడక్షన్ పనులు అట్టహాసంగా ప్రారంభం అయినట్లు పేర్కొన్నాడు.
Also Read: Maharaja: ఒంటినిండా గాయాలతో విజయ్ సేతుపతి..
అయితే సుస్మిత కొణిదల నిర్మాణంలో తెరకెక్కబోతున్న మెగా 156 సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే మెగా 157 ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కావడానికి మరొక ప్రత్యేకమైన కారణం కూడా ఉందని అంటున్నారు. ఈ సినిమా సోషియో ఫాంటసీ సినిమా కావడంతో చాలా విఎఫ్ఎక్స్ వర్క్ తో పాటు ప్రీవిజులైజేషన్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. దానికి చాలా సమయం పడుతుందని భావించిన మేకర్స్ మెగా 156 ఇంకా పూర్తిస్థాయిలో ప్రీ ప్రొడక్షన్ ప్రారంభం కాకముందే మెగా 157 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వశిష్ట తన తొలి చిత్రం బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ బింబిసార బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సోషియో ఫాంటసీ సినిమా అయిన బింబిసారను చాలా చక్కగా తెరకెక్కించాడు వశిష్ట. ప్రతి సన్నివేశంలో తన మార్క్ గుర్తుండేలా చేశారు. ఇప్పుడు చిరుతో కూడా ఆయన సోషియో ఫాంటసీ చిత్రం తీస్తూ ఉండటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక చిరు కూడా జగదేకవీరుడు అతిలోక సుందరి, అంజి వంటి సోషియో ఫాంటసీ సినిమాలు ఇప్పటికే చేశారు. చిరంజీవి కెరీర్ లో అవి చాలా పెద్ద హిట్ మూవీస్ గా కూడా నిలిచారు. ఇక జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా అయితే ఎప్పటికీ చిరు టాప్ 10 బెస్ట్ చిత్రాల్లో నిలుస్తుంది. అయితే చిరు చాలా రోజుల తర్వాత ఈ జానర్ చేస్తున్నారు. దానికి తోడు తెలుగులో కూడా సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో వచ్చిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఇక చిరు సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. దీంతో సినిమాలో ఉండే హంగులకు ఎటువంటి లోటు ఉండదు అని అర్థం అవుతుంది. కీరవాణి దీని సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.