Maharaja: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా అది మక్కల్ సెల్వన్ దిగనంత వరకే.. ఒక్కసారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు అంటే .. విజయ్ సేతుపతిని చూడడం అసాధ్యమే అని చెప్పాలి. భాషతో పనిలేకుండా అన్ని వుడ్స్ ను ఏలుతున్న రాజు .. ప్రస్తుతం మహారాజా గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, క్యామియో .. ఇలా పాత్రకు ప్రాధాన్యత ఉండాలే కానీ.. హీరో ఎవరు.. ? భాష ఏంటి..? అనేది చూడడు. ఈ మధ్యనే జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి.. తన 50 వ చిత్రాన్ని ప్రకటించాడు. నితిలన్ సమీనాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రం మహారాజా. థింక్ స్టూడియోస్ ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీశ్ పళని సామీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కే ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన మమతా మోహన్ దాస్, అభిరామి నటిస్తున్నారు.
Jailer: జైలర్ సక్సెస్.. కళానిధి ఎవ్వరినీ వదలలేదుగా..
ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ సేతుపతి డేంజరస్ లుక్ లో కనిపించాడు. సెలూన్ షాప్ లో ఉండే కటింగ్ చైర్ పై కూర్చొని.. ఒంటినిండా గాయాలతో.. చేతిలో కత్తి పట్టుకొని సీరియస్ లుక్ లో కనిపించాడు. వెనుక బ్యాక్ డ్రాప్ లో పోలీసులు కనిపిస్తున్నారు. దీంతో ఇదేదో క్రైమ్ స్టోరీ లా కనిపిస్తుంది. ఇలాంటి కథలు విజయ్ సేతుపతికి కొత్తేమి కాదు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఈ హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
#MaharajaFirstLook@Dir_nithilan @PassionStudios_ @TheRoute @Sudhans2017 @Jagadishbliss @anuragkashyap72 @Natty_Nataraj @mamtamohan @Abhiramiact @AjaneeshB @Philoedit @DKP_DOP @ActionAnlarasu @ThinkStudiosInd @infinit_maze @jungleeMusicSTH @Donechannel1 #VJS50FirstLook #VJS50… pic.twitter.com/7fF5Y2rDao
— VijaySethupathi (@VijaySethuOffl) September 10, 2023