Odela Railway Station: ఎప్పుడూ చేయని పాత్ర ఇది: హెబ్బా పటేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు సంపత్ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లేతో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో అశోక్ తేజ్ దర్శకత్వంలో కె. కె. రాధా మోహన్ నిర్మించిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 26న ‘ఆహా’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలను తెలిపారు.
Also Read
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
ఈ సందర్భంగా హెబ్బా పటేల్ మాట్లాడుతూ, ”ఇదే ప్రొడక్షన్ హౌస్ లో ‘ఒరేయ్ బుజ్జిగా’లో క్యామియో రోల్ చేశాను. అప్పుడే నిర్మాత రాధా మోహన్ గారు నాతో ఒక సినిమా చేస్తానని మాటిచ్చారు. అయితే ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు చాలా వింటాం. లాక్ డౌన్ లో ఫోన్ చేసి ‘ఓదెల రైల్వేస్టేషన్’ గురించి చెప్పారు. చాలా సర్ప్రైజ్ అయ్యా. మాటని నిలబెట్టుకునే మనుషులు చాలా తక్కువగా వుంటారు. ఈ విషయంలో రాధా మోహన్ గారికి చాలా థాంక్స్. సంపత్ నంది గారు ఈ కథ చెప్పినపుడు ‘ఇలాంటి పాత్రని నేను ఎప్పుడూ చేయలేదు. అసలు నేను చేయగలనా ?’ అనే అనుమానం వచ్చింది. ఐతే సంపత్ గారు ఒకసారి ప్రయత్నించమని చెప్పారు. నా కెరీర్ లో చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ కష్టాన్ని చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో నా పాత్ర ఒక సవాల్ తో కూడుకున్నది. ఒక నటిగా ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను. వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ లాంటి మంచి టీంతో కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది” అని అన్నారు. వశిష్ట సింహ మాట్లాడుతూ, ”ఇది చాలా మంచి కథ. నాకు చాలా ఇష్టమైన సినిమా. కరోనా సెకండ్ వేవ్ సమయంలో అందరికీ సేఫ్టి ఇచ్చి ఇంత చక్కటి సినిమా తీసిన రాధా మోహన్ గారికి అభినందనలు. ఈ సినిమా కథని విన్నపుడు చాలా థ్రిల్ అయ్యాను. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా వుంటుంది. ఈ సినిమాతో సంపత్ నంది, హెబ్బా పటేల్, సాయి రోనక్ .. ఇలా అందరూ మంచి ఫ్రండ్స్ అయ్యారు. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా. ఈ చిత్రంలో ప్రతి పాత్ర ఆకట్టుకుంటుంది” అని అన్నారు.
నిర్మాత కె. కె.రాధా మోహన్ మాట్లాడుతూ.. ‘ఓదెల రైల్వేస్టేషన్’ క్రైమ్ థ్రిల్లర్. ‘ఏమైయింది ఈవేళ’ నుండి సంపత్ నందితో పరిచయం వుంది. డీ వోపీ సౌందర్ రాజన్, మ్యూజిక్ అనూప్ రూబెన్స్ ఇలా చాలా అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేశారు. వశిష్ట ఇందులో అవుట్ ఆఫ్ ది బాక్స్ పాత్ర చేశారు. హెబ్బా పటేల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేసింది. 50 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేశాం. కోవిడ్ సెకండ్ వేవ్ వలన రిలీజ్ కొంచెం ఆలస్యం అయ్యింది. ఈ సినిమాని విడుదల చేయడానికి ఆహా ఒక వేదికని ఇచ్చింది. గతంలో ఆహాలో విడుదలైన ‘ఒరేయ్ బుజ్జిగా’ అందరినీ అలరించింది. ఈ చిత్రం కూడా ఆహాలో మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నాను” అని చెప్పారు. దర్శకుడు అశోక్ తేజ్ మాట్లాడుతూ, ”కథ, మాటలు ఇచ్చిన సంపత్ నంది గారికి, నన్ను దర్శకుడిని చేసిన రాధా మోహన్ గారికి జీవితాంతం రుణపడివుంటాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిరోనక్, ‘ఆహా’ శ్రీనివాస్ మాట్లాడారు.
తాజావార్తలు
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!