Allu Arjun skips Megastar’s Varun Tej party: అదేంటి అప్పుడు అల్లు అర్జున్ మిస్ అయితే ఇప్పుడు రామ్ చరణ్ మిస్ అయ్యారు. దేనికి? ఎందుకు? అని అనుకుంటున్నారా అయితే సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే వరుణ్ తేజ్ కి జరగబోయే పెళ్లి ఈ చర్చకు కారణం అయింది. లావణ్య, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జోరందుకున్నాయి, ఈ జంట కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్న క్రమంలో వారికి వరుసగా పార్టీలు ఇస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇటీవల మెగాస్టార్ ఇచ్చిన పార్టీని అల్లు అర్జున్ స్కిప్ చేయగా ఆ పార్టీకి రామ్ చరణ్ సహా మిగతా మెగా హీరోలు అందరూ హాజరయ్యారు. ఇక ఇప్పుడు అల్లు ఫ్యామిలీ ఒక పార్టీ ఇవ్వగా దానికి రామ్ చరణ్ ఎగ్గొట్టడం ఇప్పుడు మెగా అభిమానులలో ప్రధాన చర్చకు కారణం అయింది.
ఇటీవల, మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో ఇచ్చిన పార్టీకి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైనా అల్లు అర్జున్ హాజరు కాలేదు. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం వీరి కోసం మరో పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ – నితిన్, ఆయన భార్య షాలిని వంటి వారు వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ పార్టీకి హాజరయ్యారు.ఈ ప్రత్యేక సందర్భపు ఆనందంలో పాలుపంచుకోవడానికి అందరూ తరలివచ్చారు కానీ ఈ పార్టీకి రామ్ చరణ్ తేజ్ మిస్ కావడం హాట్ టాపిక్ అయింది. అయితే రామ్ చరణ్ షూట్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ హైదరాబాద్ గచ్చిబౌలిలో జరుగుతున్న క్రమంలో ఆయన హాజరు కాలేదని అంటున్నారు.