The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ మూవీ టీజర్ డేట్ ను ప్రకటించారు. రేపు సోమవారం జూన్ 16న ఉదయం 10.52 గంటలకు రిలీజ్ చేస్తామని ఓ స్పెషల్ వీడియోతో అనౌన్స్ చేశారు. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ హర్రర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో ఓ హర్రర్ మూవీలో నటించడం ఇదే ఫస్ట్ టైమ్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, ప్రభాస్ లుక్ బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా టీజర్ అప్డేట్ వీడియో ఆకట్టుకుంటోంది.
Read Also : 8 Vasantalu Trailer : 8 వసంతాలు ట్రైలర్.. అమ్మాయి ప్రేమ లోతు..
ఆ వీడియోలో ఓ పాడుబడ్డ ఇంటి ముందు హీరోయిన్ మాళవికతో పాటు మరో ఇద్దరు బ్యూటీలు పైకి భయపడుతూ చూస్తున్నారు. వీరితో పాటు ఇంకొంత మంది పైకి చూస్తున్నారు. అప్పుడు స్క్రీన్ మీద ది రెబల్ వైబ్ టుమారో అంటూ డేట్, టైమ్ వేసేశారు. రేపటి నుంచి రెబల్ వైబ్ స్టార్ట్ అవుతుందని టీజర్ లో చూపించారు.
టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 05న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. వీఎఫ్ ఎక్స్ పనులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పనులు అన్నీ కంప్లీట్ చేసేసినట్టు తెలుస్తోంది. సౌండ్ రికార్డ్ తో పాటు కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి.
Read Also : iPhone 16 Pro: డీల్ అదిరింది.. ఐఫోన్ 16 ప్రో పై రూ. 10,000 డిస్కౌంట్..