8 Vasantalu Trailer : మైత్రీ మూవీ బ్యానర్స్ పై రూపొందిస్తున్న మూవీ 8 వసంతాలు. ఫణింద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనంతిక సానిల్ కుమార్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను అమ్మాయి ప్రేమ కథను ఆధారంగా చేసుకుని తీసినట్టు తెలుస్తోంది. ‘కడుపులో మోసి ప్రాణం పోయగలం.. చితిముట్టించి మోక్షం కల్పించలేమా’ అంట మొదలైంది ఈ ట్రైలర్.
Read Also : Nithin : ‘తమ్ముడు’ ఫస్ట్ సింగిల్ కి డేట్, టైం ఫిక్స్!
ఇందులో అనంతిక చేసే యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. ఆడవాళ్లు ఏదైనా సాధించగలరు.. వాళ్ల ప్రేమ కూడా చాలా లోతైనది అని చెప్పడమే మూవీ కథ అని తెలుస్తోంది. ‘ప్రేమ జీవితంలో ఒక దశ మాత్రమే.. దిశ కాదు’ అంటూ అనంతిక చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ప్రేమ, ప్రతీకారం లాంటి కోణాలతో మూవీని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. మగాడి ప్రేమకు సాక్ష్యాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకు ఏమున్నాయి మనసులో దాచుకున్న జ్ఞాపకాలు తప్ప అంటూ చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది.
Read Also : Buggana Rajendranath: ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం.. మాజీ మంత్రి ఫైర్..!