తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తునివు’. తెలుగులో ‘తెగింపు’ పేరుతో రిలీజ్ అవనున్న ఈ మూవీ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. హెచ్. వినోద్ ‘తునివు’ని బాడ్ మాన్స్ గేమ్ గా రూపొందించాను అంటూ సినిమాపై అంచనాలు పెంచాడు. ఈ అంచనాలు మరింత పెంచుతూ మ్యూజిక్ డైరెక్టర్ ఘిబ్రాన్ ‘గ్యాంగ్ స్టా’ అనే సాంగ్ ని బయటకి తెచ్చాడు. తునివు ఆల్బం నుంచి ఇప్పటికే రెండు పాటలు బయటకి వచ్చాయి. ‘చిల్లా చిల్లా’ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది… ఇదే మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చెయ్యడానికి ‘గ్యాంగ్ స్టా’ సాంగ్ రిలీజ్ అయ్యింది. సినిమాలో కాదు పాటలో కూడా యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఇది నిజంగానే బాడ్ మాన్స్ గేమ్ అనే మాటని ప్రూవ్ చేసింది ‘గ్యాంగ్ స్టా’ లిరికల్ సాంగ్. ఘిబ్రాన్ ఇచ్చిన ట్యూన్ ఎలక్ట్రిఫైయింగ్ గా ఉండగా, సుల్తాన్ మరియు వికేక రాసిన లిరిక్స్ అజిత్ నేచర్ ని తెలియజేసేలా ఉన్నాయి. ఈ సాంగ్ ని ఘిబ్రాన్ స్వయంగా పాడడం విశేషం.
Read Also: Varisu: ఆడియో లాంచ్ లో అజిత్ గురించి మాట్లాడుతాడా?
సోషల్ మీడియాలో #ItsTimeForGANGSTAA అనే హాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి అజిత్ ఫాన్స్ హంగామా చేస్తున్నారు. అయితే ఈ ‘గ్యాంగ్ స్టా’ సాంగ్ సినిమాలో ఒక థీమ్ సాంగ్ లా మాత్రమే ఉండేలా కనిపిస్తోంది. అది నిజమో కాదో తెలియాలి అంటే జనవరి 11న ‘తునివు/తెగింపు’ సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే. అజిత్ ‘తునివు’ సినిమాకి విజయ్ నటిస్తున్న ‘వారిసు’ సినిమా నుంచి గట్టి పోటి ఎదురవుతుంది. ఈ రెండు సినిమాలు కేవలం ఒక్క రోజు గ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. 1990 నుంచి అజిత్, విజయ్ ల మధ్య బాక్సాఫీస్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ ఫ్యాన్ వార్ లో వచ్చే సంక్రాంతికి ఎవరు గెలుస్తారు అనే ఆసక్తి కోలీవుడ్ సినీ అభిమానుల్లో ఉంది. మరి తల, దళపతిల్లో ఎవరు గెలుస్తారో చూడాలి.
Read Also: Rowdy Hero: అసలైన మాస్ హీరోలా ఉన్నాడు…