‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాడు అనుకున్న రౌడీ హీరో, దారుణమైన ఫ్లాప్ ఇచ్చి సినీ అభిమానులని నిరాశ పరిచాడు. ఈ మూవీ రిజల్ట్ తర్వాత విజయ్ దేవరకొండ బయటకి ఎక్కువగా రావట్లేదు. ప్రతి క్రిస్మస్ కి అభిమానులకి గిఫ్ట్స్ పంపించే విజయ్ దేవరకొండ ఈసారి కూడా అలానే చేస్తారని అంతా అనుకున్నారు కానీ విజయ్ దేవరకొండ సైలెంట్ గానే ఉన్నాడు. అయితే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ విశేష్ ని మాత్రం తెలియజేసాడు. ఈ సంధర్భంగా విజయ్ దేవరకొండ ఒక ట్వీట్ చేశాడు. తన అమ్మ నాన్నలతో కలిసి ఫోటో దిగి దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్ మాస్ హీరోలా ఉన్నాడు. ఈ లుక్ తో ఒక స్టైలిష్ యాక్షన్ మూవీ పడితే రౌడీ హీరో బౌన్స్ బ్యాక్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు.
Read Also: Waltair Veerayya: పోస్టర్స్ తోనే హీట్ పెంచుతున్నారు…
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ చేతిలో ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా మాత్రమే ఉంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సమంతా హీరోయిన్ గా నటిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ కూడా కొంతవరకూ జరుపుకున్న ఈ మూవీని ఆపేసారు అనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. సమంతా డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేకపోతుందని, ఆమె ఆనారోగ్యం కారణంగానే ‘ఖుషి’ మూవీ డిలే అవుతుందనే రూమర్ అంతటా స్ప్రెడ్ అయ్యింది. దీంతో సమంతా పర్సనల్ టీం రెస్పాండ్ అవుతూ… ‘సమంతా ఒప్పుకున్న ఏ సినిమా నుంచి తప్పుకోలేదు. జనవరి థర్డ్ వీక్ లో ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఆ సినిమా అయ్యాకే బాలీవుడ్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతుంది’ అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ‘ఖుషి’ సినిమా ఆగిపోలేదు అనే క్లారిటి అందరికీ వచ్చింది. ఈ బ్యూటిఫుల్ లవ్ డ్రామాతో అయినా విజయ్ దేవరకొండ కంబ్యాక్ హిట్ ఇస్తాడేమో చూడాలి.
Read Also: Masooda: ఆర్జీవీ నీ పనికిమాలిన టైం మాకు ఇవ్వు…