డిఫరెంట్ కాన్సెప్టులతో, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో అటు ఫ్యామిలీ ఆడియన్స్, ఇటు యూత్‌ను ఆకట్టుకుంటోన్న టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు. సైడ్ క్యారెక్టర్ల నుండి హీరోగా మారిన ఈ టాలెంట్ యాక్టర్‌కు సింగిల్‌తో కింగ్ ఆఫ్ కంటెంట్, ఎంటర్ టైనర్ అంటూ ట్యాగ్స్ వచ్చాయి. ఈ ట్యాగ్స్ కు జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా.. అందుకే నెక్ట్స్ సినిమాల్లో ఎక్స్ పరిమెంట్స్ చేస్తున్నాడు. జస్ట్ జోవియల్ కథలే కాదు.. సీరియస్ స్టోరీలు టచ్ చేయబోతున్నాడు.
Also Read : I – Bomma : ఐబొమ్మ రవికి మరొక షాక్.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్
సింగిల్ తర్వాత శ్రీ విష్ణు నుండి వస్తోన్న ఫిల్మ్ విష్ణు విన్యాసం.. మరోసారి జోవియల్ కథతో వచ్చేస్తున్నాడు. ఇలాంటి రోల్స్ అయితే సార్‌కు వెన్నతో పెట్టిన విద్యే కానీ.. రప్ఫాడించేస్తాడు. యుదునాథ్ మారుతిరావ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతుంది. ఇక నెక్ట్స్ సీరియస్ కథతో రాబోతున్నాడు కంటెంట్ హీరో. మృత్యుంజయ్ అని యాక్షన్ ఎంటర్టైనర్‌తో రాబోతుననాడు. సామజవరగమనతో కడుపుబ్బా నవ్వించిన శ్రీవిష్ణు- రెబా మోనికా జాన్ ఇందులో మరోసారి జోడీ కడుతున్నారు. ఈ సినిమాకు మీకు మీరే మాకు మేమే ఫేం హుస్సేన్ షా కిరణ్ దర్శకుడు. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కామ్రేడ్ కళ్యాణ్ అంటూ నక్సలైట్ అవతారమెత్తాడు శ్రీ విష్ణు. 1992 బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతోంది ఈ మూవీ. ఇందులో కూడా అగ్రెసివ్‌గానే కనిపించబోతున్నాడు హీరో. ఈ మూవీని స్కంద వాహనా మోహన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా. బాబీ కొల్లి, కోనా వెంకట్ ప్రజెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో ఓ మూవీకి కమిటయ్యాడు. అనగనగా ఫేం సన్నీ సంజయ్ దర్శకుడు. సామగజవరగమన ఫేం రామ్ అబ్బరాజు, గీతా2లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లోనే కాదు… నారీ నారీ నడుమ మురారీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు. తన స్పెషల్ క్యామియో.. శర్వానంద్‌కు హిట్టిస్తుందేమో చూడాలి…