పైరసీ సినిమాల కేసులో అరెస్టయిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి మరో షాక్ తగిలింది. తానూ హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్ళనని పొలిసు విచారణకు సహకరిస్తాని బెయిల్ ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు ఇమంది రవి. అయితే రవి పలు దేశాల పౌరసత్వం కలిగి ఉన్నాడని, బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు పోలీసులు. ఇరువురి వాదనలు పరిశీలించిన కోర్టు పైరసీ వెబ్ సైట్స్ నిర్వహిస్తూ సినిమాలను అక్రమంగా వెబ్ సైట్స్ లో అప్లోడ్ చేస్తున్న ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. కొత్తగా విడుదలైన సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేసి వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తూ చిత్ర పరిశ్రమకు వందల కోట్ల నష్టం కలిగించిన రవి ఇప్పుడు తానూ ఇకనుండి ఎటువంటి తప్పు చేయనని, పైరసీ జోలికి వెళ్లానని కూడా కోర్టుకు మొరపెట్టుకున్నాడు. కానీ రవి అభ్యర్థను పట్టించుకోని న్యాయస్థానం బెయిల్ ఇచ్చేది లేదని తీర్పునిస్తూ తీర్పు వెల్లడించింది.