The Family Star: స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజీర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్నిపెంచేసిన మేకర్స్.. వరుస లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. తాజాగా మూడో సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మధురము కదా అంటూ సాగే సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. మధురము కదా.. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఆర్కిటెక్ట్ గా విజయ్ దేవరకొండ తను వర్క్ చేస్తున్న బిల్డింగ్ దగ్గర మృణాల్ ఠాకూర్ తో కలిసి కూర్చుని మాట్లాడుతున్న స్టిల్ తో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఇక సాంగ్ కాకుండా ఈ నెల 28 న ది ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.