The Family Star: ది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుందని ప్రకటించారు. కానీ, సంక్రాంతి నుంచి ది ఫ్యామిలీ స్టార్ అవుట్ అయ్యింది. అయితే దానికి కారణాలు చాలానే ఉన్నాయి. అప్పటికి షూటింగ్ పూర్తికాకపోవడం, మిగతా వర్క్స్ ఫినిష్ కాలేదని, అందుకే ది ఫ్యామిలీ స్టార్ వాయిదా పడిందని తెలుస్తోంది. గీతగోవిందం మూవీ తర్వాత విజయ్ – పరశురామ్ కాంబోలో వస్తున్న రెండవ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై గతంలో దిల్ రాజు క్లారిటీ కూడా ఇచ్చాడు.
దేవర సినిమా కనుక ఏప్రిల్ 5 నుంచి వాయిదా వేస్తున్నట్లు గనక ప్రకటిస్తే అప్పుడు ఫ్యామిలీ స్టార్ అదే డేట్ కి రిలీజ్ చేస్తామని, ఎన్టీఆర్ దేవర సినిమా అయితే పాన్ ఇండియా కాబట్టి ఆ రోజు రిలీజ్ చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ తమ ఫ్యామిలీ స్టార్ తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపాడు. ఇక అనుకున్నట్లుగానే ఆ డేట్ ను లాక్ చేశారు. తాజాగా ది ఫ్యామిలీ మ్యాన్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 5 న ఫ్యామిలీ స్టార్ వస్తున్నాడు అని మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5 న వస్తుంది అంటే.. దేవర కచ్చితంగా వాయిదా పడినట్లే అని అభిమానులు అంటున్నారు. ఇక ది ఫ్యామిలీ స్టార్ పోస్టర్ లో రేషన్ కోసం ఆధార్ కార్డు పట్టుకొని లుంగీతో పరిగెడుతున్నట్లు విజయ్ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.