NTRxTrivikram : ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై తమిళ తంబీల ఆగ్రహం.. కారణమేంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రకటించిన మైథలాజికల్ యాక్షన్ ఎపిక్ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా చుట్టూ అప్పుడే వివాదం మొదలైంది. సుబ్రహ్మణ్య స్వామి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదలైన కొద్ది గంటల్లోనే నెట్టింట భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది . అయితే ఈ సినిమా ప్రకటన తమిళ తంబిలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఈ వివాదానికి ప్రధాన కారణం చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో పెట్టిన ఒక క్యాప్షన్. లార్డ్ మురుగన్‌ను ఉద్దేశిస్తూ.. “ఉత్తరాదిన జన్మించి, దక్షిణాదిన పూజలు అందుకుంటున్నాడు. ఇప్పుడు ఇది విశ్వానికి చెప్పాల్సిన కథ” అని రాసుకొస్తూ పోస్ట్ చేసారు. ఈ వ్యాఖ్యలపై తమిళ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కుమారస్వామి తమిళ సంస్కృతి, చరిత్ర, మరియు భాషలతో విడరాని బంధాన్ని కలిగి ఉన్నారని, చరిత్రను మార్చే ప్రయత్నం చేయవద్దంటూ మేకర్స్‌ను హెచ్చరిస్తున్నారు. మరోవైపు, లార్డ్ మురుగన్ కేవలం తమిళనాడుకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా పూజలు అందుకుంటున్న దేవుడని నెటిజన్లు సినిమా అభిమానులు గుర్తు చేస్తున్నారు. సినిమాకు సంబంధించి కేవలం ఒక పోస్టర్ మాత్రమే వచ్చిందని అసలు కథ ఏంటో తెలియకుండా అప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. మురుగన్ నార్త్ లో జన్మించారా? తమిళనాడు లో జన్మించారా? అన్నది పరిశీలిస్తే ఇప్పుడంటే నార్త్, సౌత్ అని వేరు చేసి మాట్లాడుతున్నాం కానీ పురాణాల కాలం నాడు హిందూ సామ్రాజ్యం చాలా విశాలం కదా. సమస్త భారతం ఒక్కటే కదా ఇన్ని భాగాలు లేవు కదా. అలాంటప్పుడు అసలు ఇలాంటి వివాదాలు అర్థరహితమని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
- Zombie Reddy 2: తేజ సజ్జ సరసన బాలీవుడ్ బ్యూటీ? టాలీవుడ్ ఎంట్రీకి షనయా కపూర్ రెడీనా!
- Oh Sukumari: షాక్ ఇచ్చే ప్రేమకథతో వస్తున్న 'ఓ సుకుమారి'.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Akhil Raj: హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి?
తాజావార్తలు
-
NTRxTrivikram : ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై తమిళ తంబీల ఆగ్రహం.. కారణమేంటంటే?
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్‌ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
-
Tata Sierra EV: 665KM రేంజ్‌తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
-
Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!