ఒక్కోసారి కొన్ని సినిమాలకు అనుకోకుండా భలే గిరాకీ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇలానే నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాకు డిమాండ్ ఏర్పడింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సినిమా అర్జున్ అర్జున్ S/o వైజయంతి. ఏడాది కాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి మొన్నటి వరకు ఎక్కడా పెద్దగా చర్చలేదు.
Also Read : Suriya : వెంకీ అట్లూరి – సూర్య సినిమాకు ముహూర్తం ఫిక్స్
కానీ ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిందో అప్పటి నుండి బిజినెస్ సర్కిల్స్ లో ఈ సినిమా గురించి చర్చ జరగడం మొదలైంది. ఎవరికున్న సర్కిల్స్ లో వారు ఈ సినిమా ఇన్ సైడ్ టాక్ ఏంటనే దానిపై ఆరాలు తీయడం స్టార్ట్ చేసారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా వస్తున్న అర్జున్ S/o వైజయంతి కళ్యాణ్ రామ్ కు మరో భారీ హిట్ ఇస్తుందని తెలియడంతో మేకర్స్ కు మంచి ఆఫర్స్ వచ్చాయి. కేవలం ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ రూ. 12 కోట్లకు అటు ఇటుగా తెగింది. అటు రాయలసీమ ఏరియా అయిన సీడెడ్ వరకు రూ. 3.60 కోట్లకు రాయుడు కంపెనీ నాన్ రిటర్న్ అడ్వాన్స్ కింద ఫిక్స్ అయింది. ఈ రేట్ కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్. కేవలం ఒకే ఒక టీజర్ తో ఈ సినిమాకు ఇంతటి డిమాండ్ వచ్చింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.