నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న చిత్రమే మ్యాడ్ స్క్వేర్. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం అందరిలోను ఉంది.
కాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియా వ్యవహరిస్తున్నాడు. మనోడు ఇచ్చిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఈ సినిమాకు తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని ఆ విషయాన్నీ అఫీషియల్ గా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. భీమ్స్ ను ఎందుకు తప్పించారోననేది క్లారిటీ లేదు. భీమ్స్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇచ్చిన బీజీఎమ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి భీమ్స్ ను కాదని తమన్ ను ఎందుకు తీసుకున్నారోననే చర్చ మొదలైంది. ఇటీవల తమన్ వర్క్ చేసిన ప్రతి సినిమా మ్యూజిక్ పరంగాను, అటు బీజీఎమ్ పరంగాను సెన్సేషన్ క్రియేట్ చేసాయి. సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని ఉద్దేశంతో తమన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న మ్యాడ్ స్క్వేర్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో మరో నాలుగు రోజుల్లో తెలియనుంది.