దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మాణంలో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ‘వారిసు’ మూవీ తెలుగులో ‘వారిసుడు’ పేరుతో రిలీజ్ కానుంది. సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానున్న ‘వారిసు’ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ విజయ్ ఫాన్స్ లో జోష్ నింపుతున్నారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న వారిసు సినిమా నుంచి ఇప్పటికే ‘రంజితమే’ సాంగ్ రిలీజ్ అయ్యి తెలుగు తమిళ భాషల్లో చార్ట్ బస్టర్ అయ్యింది. వారిసు ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన ఈ సాంగ్ ఇచ్చిన జోష్ లో ‘వారిసు’ మేకర్స్ సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు.
‘థీ దళపతి’ అంటూ సాగనున్న సెకండ్ సాంగ్ ని డిసెంబర్ 4న సాయంత్రం 4 గంటలకి రిలీజ్ చేయనున్నారు. ‘థీ’ అనేది తమిళ పదం అంటే తెలుగులో నిప్పు అని అర్ధం. ది బాస్ రిటర్న్స్ అంటూ విజయ్ ఫాన్స్ ని ఎగ్జైట్ చేస్తున్న ‘వారిసు’ సినిమాని జనవరి 12న విడుదల చేయనున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ‘వారసుడు’ సినిమాకి ఎక్కువ థియేటర్స్ కేటాయింపు పై రగడ జరుగుతోంది. డబ్బింగ్ సినిమాకి పండగ సీజన్ లో అన్ని థియేటర్స్ ఇవ్వకుండా తెలుగు సినిమాలకి ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి దిల్ రాజు ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతాడు? వారిసు/వారసుడు రిలీజ్ సమయానికి థియేటర్స్ ఇష్యూ ఎక్కువ అవుతుందా అనేది చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఇష్యూని ఫేస్ చేస్తున్న ‘వారిసు’ సినిమాకి తమిళనాడులో ‘తునివు’ నుంచి సమస్య ఎదురవుతోంది. అజిత్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘తునివు’ సినిమాని కూడా సంక్రాంతికే విడుదల చేస్తున్నారు. విజయ్ vs అజిత్ ఒకే సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తే కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చిన్న సైజ్ యుద్ధం జరిగినట్లు ఉంటుంది. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారో అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.