కోలీవుడ్ లో అజిత్ కి ఉండే ఫ్యాన్ బేస్ సైలెంట్ కాదు బాగా వయోలెంట్. తమ హీరోని ఏమైనా అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ‘వెర్బల్ వార్’కి దిగే అజిత్ ఫాన్స్, ట్విట్టర్ లో ‘లైకా ప్రొడక్షన్ హౌజ్’ని ట్యాగ్ చేసి మరీ చుక్కలు చూపిస్తున్నారు. ‘తునివు’ తర్వాత అజిత్ ‘విడ ముయార్చి’ అనే సినిమా చేస్తున్నాడు. మగిళ్ తిరుమేని ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి నెలలు దాటుతుంది కానీ షూటింగ్ అప్డేట్ మాత్రం బయటకి రావట్లేదు. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? ఎవరెవరు వర్క్ చేస్తున్నారు? లాంటి విషయాల్లో ఫ్యాన్స్ ఎలాంటి అప్డేట్ లేదు. గత కొన్ని రోజులుగా ఓపిక పడుతూ వచ్చిన అజిత్ ఫ్యాన్స్ ఎట్టకేలకు బరస్ట్ అవుట్ అయ్యారు.
ఒక స్టార్ హీరో సినిమా అనౌన్స్ చేసి స్టార్ట్ చేయకుండా సైలెంట్ గా ఫాన్స్ డిజప్పాయింట్ అవ్వడం మాములే. అజిత్ ఫ్యాన్స్ మాత్రం కాస్త ఆ బార్డర్ ని క్రాస్ చేసి సోషల్ మీడియాలో ప్రొడ్యూసర్స్ కి కాస్త హీట్ తగిలించారు. అజిత్ పీఆర్వో అయిన ‘సురేష్ చంద్ర’ని పేరున #worstprosureshchandra అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్రెండ్ చేశారు. #wakeuplycaproductions #ajithkumar ఇలా రెండు మూడు హాష్ టాగ్స్ క్రియేట్ చేసి ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. నిజానికి అజిత్ ఫాన్స్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. అజిత్ లాస్ట్ మూవీ ‘తునివు’ సినిమా సమయంలో కూడా అప్డేట్స్ కావాలి అంటూ రచ్చ రచ్చ చేశారు. దీంతో అజిత్ ‘ఓపిక’తో ఉండండి అంటూ ఓపెన్ లెటర్ నే రిలీజ్ చేయాల్సి వచ్చింది. మరి ‘విడ ముయార్చి’ విషయంలో జరుగుతున్న దానికి అజిత్ స్పందిస్తాడా? లేక ప్రొడ్యూసర్, డైరెక్టర్ స్పందిస్తారా అనేది చూడాలి.