Ee Nagaraniki Emaindi Re Release: స్నేహితులు అంటే ఎలా ఉంటారు.. వారి కాలేజ్ టైమ్ లో చేసిన అల్లర్లు ఏంటి..? లైఫ్ గురించి వారు ఎలా ఆలోచిస్తారు..? అన్ని ఒక సినిమాగా తీస్తే.. ఈ నగరానికి ఏమైంది వస్తుంది. కామెడీ, లవ్, రొమాన్స్, యాక్షన్, డ్రామా.. ఎన్ని జోనర్లు ఉంటే అన్ని జోనర్లు అన్ని ఈ సినిమాలో ఉంటాయి. ప్రేక్షకులకు ముఖ్యంగా అబ్బాయిలకు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఈ నగరానికి ఏమైంది. మొన్నీమధ్య ఎన్టీఆర్ సైతం.. తాను డల్ గా ఉంటే ఇదే సినిమా చూస్తానని చెప్పుకొచ్చాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించాడు. 2018 లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అయితే అందుకోలేదు కానీ యావరేజ్ టాక్ ను అయితే అందుకుంది. కానీ చాలామందికి ఈ చిత్రం ఫేవరేట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విశ్వక్ సేన్, అభినవ్ గోముటం, సాయిసుశాంత్, వెంకటేష్ కాకుమను హీరోలుగా సిమ్రాన్ చౌదరి, అనీషా అంబ్రోస్ హీరోయిన్లుగా నటించారు. నిజం చెప్పాలంటే వీరి సొంత పేర్లు కన్నా.. ఈ సినిమాలో ఉన్న పేర్లతోనే వీరు బాగా ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు. సైకో వివేక్, కార్తీక్, కౌశిక్.. ఇక మీమ్స్ పేజెస్ అయితే ఈ సినిమాను గాడ్ లా చూస్తుంది అంటే అతిశయోక్తి కాదు.
Mahesh Babu: ‘దసరా’ మూవీ రివ్యూ చెప్పిన మహేష్.. ఏమన్నాడంటే..?
సరే సరే అసలు ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే.. ఈ సినిమా మరోసారి అల్లరి చేయడానికి థియేటర్ లోకి వచ్చేస్తుంది కాబట్టి.ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెల్సిందే. ఎప్పటినుంచి అయితే ఈ ట్రెండ్ నడుస్తుంధో అప్పటి నుంచి తరుణ్ భాస్కర్ ను ఈ సినిమా రీ రిలీజ్ చేయమని అభిమానులు అడుగుతూనే వస్తున్నారు. బ్యాచ్ లతో సహా సినిమాకు వెళ్లాలని కోరిక గా ఉందని వారు చెప్పుకొచ్చారు. ఇక అభిమానుల కోరికను తరుణ్ కాదంటాడా..? అందుకే ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్ ఉందని మాట ఇచ్చేశాడు. ” ఈసారైనా మీ గ్యాంగ్ టోరీ థియేటర్స్ కు వస్తారా..? నెక్స్ట్ అప్డేట్.. రీ రిలీజ్.. వెయిట్ చేయండి.. మాట్టిచ్చినా” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఒక్క హింట్ తో అభిమానులు యమా యాక్టివ్ అయిపోయారు. దీని కోసం ఎన్ని బ్యాచ్ లు ఎదురుచూస్తున్నాయో.. తెలుసా అన్నా.. ఈసారి గట్టిగా ఇచ్చిపడేసుడే .. నువ్వేం ఫికర్ కాకు అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ రీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలియాలంటే ఇంకో అప్డేట్ వచ్చేవరకు ఆగాల్సిందే.