యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” షో అలా అలా సాగుతోంది. ఈ షోకు టీఆర్పీని పెంచడానికి నానా తంటాలూ పడుతున్నారు. అయినప్పటికీ యావరేజ్ కి మించి టిఆర్పి రేటింగ్ పెరగడం లేదు. మేకర్స్ ప్రత్యేకంగా షోపై బజ్ ను పెంచడానికి సెలెబ్రిటీలను సైతం ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు రామ్ చరణ్, రాజమౌళి, మహేష్ బాబు, సమంత వంటి స్టార్స్ హాజరయ్యారు. రానున్న పండగల సందర్భంగా ఈ సెలెబ్రిటీల స్పెషల్ ఎపిసోడ్స్ ను ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేకర్స్. మహేష్ బాబు ఎపిసోడ్ దసరా సందర్భంగా ప్రసారం చేయాలని భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా సమంత ఎపిసోడ్ ప్రీమియర్ కావచ్చు. గురువారం సామ్ పై ప్రత్యేక ఎపిసోడ్ కోసం చిత్రీకరించారు. తాజాగా మరో పాపులర్ బ్యూటీ ఎన్టీఆర్ షోకు గెస్ట్ గా రాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి.
Read Also : పవన్ తో పూజాహెగ్డే… లీక్ చేసిన దర్శకుడు
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా “ఎవరు మీలో కోటీశ్వరులు”షోలో త్వరలోనే హాట్ సీట్ పై కూర్చొనుందని అంటున్నారు. ఈ షో కోసం తమన్నా భాటియా ఎపిసోడ్ షూట్ వచ్చే వారంలో జరుగుతుంది. మరోవైపు కాల్ షీట్ సమస్యల కారణంగా తమన్నా భాటియా మాస్టర్ చెఫ్ తెలుగుకి హోస్ట్‌గా చేయడం ఆపేసింది. ఆమె స్థానంలో యాంకర్, నటి అనసూయ భరద్వాజ్‌ని తీసుకున్నారు.