పవన్ తో పూజాహెగ్డే… లీక్ చేసిన దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బుట్టబొమ్మ పూజాహెగ్డే రొమాన్స్ చేయబోతోంది. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించకపోయినా ఓ దర్శకుడు లీక్ చేసేశాడు. పవన్ ప్రస్తుతం హరీష్ శంకర్‌తో కలిసి “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా చేస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. 2012 లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్‌తో రెండోసారి తెరకెక్కించబోతున్న సినిమా ఇది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం “భవదీయుడు భగత్ సింగ్‌”లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు హరీష్ శంకర్ ప్రకటించారు. నిన్న జరిగిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.

Read Also : ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి : హరీష్ శంకర్

హరీష్ శంకర్ మాట్లాడుతూ పూజా హెగ్డే సమర్ధవంతమైన నటి అని తాను నమ్ముతున్నానని, పవన్ కళ్యాణ్ నటించిన ‘భవదీయుడు భగత్ సింగ్’లో ఆమె హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. పూజా హెగ్డే, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. డీజే, గద్దలకొండ గణేష్ తర్వాత పూజా, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ. “భవదీయుడు భగత్ సింగ్”ను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రామ్-లక్ష్మణ్ జంట యాక్షన్ కొరియోగ్రఫీని నిర్వహిస్తారు.

-Advertisement-పవన్ తో పూజాహెగ్డే… లీక్ చేసిన దర్శకుడు

Related Articles

Latest Articles