Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఆమె ఏ చిన్న పోస్టు పెట్టినా సరే అది విజయ్ వర్మను ఉద్దేశించే అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి టైమ్ లో సంచలన పోస్టు పెట్టింది తమన్నా. నిలువెత్తు అందాల రాశి తమన్నా ఎవరి సొంతమో అని కుర్రాళ్లంతా ఊహించుకుంటున్న టైమ్ లో విజయ్ వర్మతో ప్రేమలో పడింది. లస్ట్ స్టోరీస్-2 టైమ్ లో నుంచే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరే వైరల్ అయ్యేవారు. విజయ్ వర్మ చాలా లక్కీ.. తమన్నా లాంటి అందగత్తె దొరికింది అంటూ ఎన్నో మీమ్స్, ట్రోల్స్ కనిపించేవి.
Read Also : Harish Rao: ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం..
కానీ సడెన్ గా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒక చోట కనిపించట్లేదు. ఒక ఈవెంట్ కు కూడా వేర్వేరుగా వస్తున్నారు. మాట్లాడుకోవట్లేదు. దాంతో బ్రేకప్ వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా తమన్నా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ఇందులో ఆమె.. “అద్భుతాల కోసం ఎదురు చూడొద్దు.. మనమే జీవితంలో అద్భుతాలను సృష్టించుకోవాలి” అంటూ రాసుకొచ్చింది. విజయ్ ను ఉద్దేశించే తమన్నా ఈ పోస్టు పెట్టింది అంటున్నారు. బ్రేకప్ ను వీరిద్దరూ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటున్నారు.