Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న తాజా మూవీ పెద్ది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ షాట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐపీఎల్ టీమ్స్ కూడా పెద్ది వీడియోను రీ క్రియేట్ చేశాయంటే దాని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడంట బుచ్చిబాబు. ఊర మాస్ స్టెప్పులతో సాంగ్ ఈ స్పెషల్ సాంగ్ లో చేయడానికి ఓ హీరోయిన్ కోసం వెతుకుతున్నాడంట.
Read Also : Deputy CM Pawan Kalyan: రక్షణ దళాల సిబ్బందికి గుడ్‌న్యూస్.. పవన్ కీలక ప్రకటన
ఈ క్రమంలోనే తమన్నాను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తమన్నా ఈ నడుమ వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తూ ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకుంటోంది. పైగా నార్త్ లో కూడా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. కాబట్టి మూవీకి ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకుంటున్నారంట. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. కాబట్టి ఆ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రాబోతోంది.
Read Also : AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ.. మరో లిస్ట్ విడుదల..