అక్కినేని హీరో సుశాంత్ మొదటి విభిన్నమైన సినిమాలు చేస్తున్న సరైన హిట్ అందుకోవడంలో వెనక్కి పోతున్నారు. ఆమధ్య రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘చి.ల.సౌ’ సినిమాతో కాస్త పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి అందరి మన్నలు పొందాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’.. ఆగస్టు 27న విడుదల అవుతున్న సందర్బంగా నేడు ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సందర్బంగా సుశాంత్ మాట్లాడుతూ.. ‘మొదటగా.. నాగార్జున మామకి థాంక్స్ చెప్పాలి, చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆయన మేలు మర్చిపోలేను. ఇక ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా కోసం మేకర్స్ అంత చాలా కష్టపడ్డారు.. కరోనా పరిస్థితుల్లోను ఓటీటీకి వెళ్లకుండా, థియేటర్స్ లోనే విడుదల చేయాలనీ అనుకున్నాం.. ఈ విషయంలో నిర్మాత రవిశంకర్ శాస్త్రి సహకారం మరువలేనిది. ఎస్ దర్శన్ దర్శకత్వంలో మరోసారి పని చేయాలనుకుంటున్నాను, అంత బాగా వచ్చింది. ఇక ఈ సినిమా అనుకున్న స్టార్టింగ్ లోనే ‘అల వైకుంఠపురములో’ చిత్రం చేయాల్సి వచ్చింది. త్రివిక్రమ్ నుంచి చాలా నేర్చుకోవచ్చు, అల్లు అర్జున్ ను దగ్గర నుంచి చూడొచ్చు.. మంచి మిత్రుడు అని యాక్ట్ చేశాను. యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా మీరందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అంటూ సుశాంత్ తెలిపారు.