అక్కినేని హీరో సుశాంత్ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.ఒక పక్క హీరోగా చేస్తూనే మరోపక్క స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. రవితేజ రావణాసుర లో సుశాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇది కాకుండా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుశాంత్ తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. మీ ప్రశ్నలు ఏంటో సంధించండి.. సమాధానాలు ఇస్తాను అని ఓపెన్ ఆఫర్ ఇచ్చేసాడు. దీంతో అభిమానులు తమకిష్టమైన ప్రశ్నలను అడిగేశారు. “మీ మొబైల్ వాల్ పేపర్ ఏంటి అని ఒక నెటిజన్ అడుగగా .. తాతగారి ఫోటో అని చూపించాడు.
చై, అఖిల్ లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు అంటే .. అస్సలు ప్రశ్నే తప్పు అని సమాధానమిచ్చాడు. మరి పెళ్లి తేదీ ఎప్పుడు అని అడుగగా.. ఇంకా పెళ్లి కూతురే సెట్ అవ్వలేదు అప్పులే పెళ్లి తేదీ ఏంటి అని నవ్వేశాడు.. ఇంకో నెటిజన్ కాస్తా ముందుకెళ్లి అన్నా నువ్వు వర్జిన్ వా అని అడిగేశాడు. దానికి నిప్పు ఉన్న ఫోటోను యాడ్ చేసి నేను నిప్పు అని చెప్పుకొచ్చాడు. అన్నానే గర్ల్ ఫ్రెండ్ ఫోటోపెట్టు అన్న నెటిజన్ కు వండర్ విమెన్ ఫోటో పెట్టి షాక్ ఇచ్చాడు. ఇలా సిల్లీ ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా, వినోదాత్మకంగా సమాధానాలు చెప్పాడు. ప్రస్తుతం ఈ చిట్ చాట్ నెట్టింట వైరల్ గా మారింది.