Suriya- Jyothika: కోలీవుడ్ అడోరబుల్ పెయిర్ అంటే టక్కున సూర్య- జ్యోతిక గుర్తొస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. వైవాహిక బంధంలో ఒక ఫేజ్ ను దాటేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. దియా మరియు దేవ్. దియా ప్రస్తుతం ప్లస్ టూ చదువుతుంది. ఇక సూర్య సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తాడు. నిత్యం పిల్లలతో కలిసి వెకేషన్స్ కు వెళ్తూ ఉంటాడు. ప్రస్తుతం సూర్య- జ్యోతిక ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు. ఒకపక్క నటులుగా, ఇంకోపక్క నిర్మాతలుగా రెండు చేతులా సంపాదిస్తున్నారు. తాజాగా ఈ జంట.. పిల్లలతో కలిసి వెకేషన్ కు వెళ్లారు. ఆ వీడియోలను జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిజం చెప్పాలంటే.. సూర్య..తన పిల్లలను మీడియాకు దూరంగా ఉంచుతూ పెంచుతున్నాడు. బయట ఎక్కడ కనిపించినా వారిని ఫోటోలు, వీడియోలు తీయొద్దని చెప్పుకొస్తాడు. అందుకే దియా, దేవ్ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రేర్ గా కనిపిస్తాయి.
Pawan Kalyan: ఇన్స్టాగ్రామ్ లోకి పవన్ కళ్యాణ్.. మొదటి పోస్ట్ ఏంటి అంటే.. ?
తాజాగా ఈ వీడియోలో అందరి చూపు దియా మీదనే ఉంది.. చూస్తూ చూస్తూనే దియా పెద్దది అయిపోయింది. ఆమెను చూస్తుంటే.. తల్లి జ్యోతిక అందం.. సూర్య కళ రెండు కనిపిస్తున్నాయి. చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న కుర్ర హీరోయిన్లకు పోటీ వచ్చేలా కనిపిస్తుంది. ఎప్పటికైనా దియా హీరోయిన్ గా ఇండస్ట్రీకి వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ, అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దని ఆ సూర్య సన్నిహిత వర్గాల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. డియాకు చదువు అంటే చాలా ఇష్టమట.. గతేడాది ఆమె 10th ఫలితాల్లో ఆమె అదరగొట్టింది. ఇక ఇప్పుడు దియా ఫోకస్ అంతా చదువు మీదనే ఉన్నదట. ఇప్పుడప్పుడే ఆమె సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. ఇక సూర్య – జ్యోతిక సైతం దియాకు ఎందులో రాణించాలని ఉంటుందో అందులోకే వెళ్లమని ఎంకరేజ్ చేస్తామని ఎన్నోసార్లు చెప్పారు. మరి దియా మనసులో ఏం ఉంది అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.