Pawan Kalyan: ఒకప్పుడు సెలబ్రిటీల గురించి.. వారి పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవాలంటే.. ఏదైనా ఇంటర్వూస్ లో కానీ, పేపర్ లో కానీ వస్తేనే తెలిసేవి. కానీ, సోషల్ మీడియా వచ్చాకా అదంతా మారిపోయింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ లాంటి యాప్స్ లోకి సెలబ్రిటీస్ ఎంటర్ అవ్వడం ఆలస్యం .. వాళ్ళను ఫాలో అవుతూ.. వారి అప్డేట్స్ ను తెలుసుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ను బిజినెస్ గా చూస్తున్నారు. ఎంతఎక్కువ ఫాలోవర్లు ఉంటే వారికిఅంత ఎక్కువ అమౌంట్ వస్తుంది. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఒక్కో పోస్ట్ కు కొన్ని లక్షలు అందుకుంటున్నారు. ఇక ఇప్పుడున్న సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నవారే. ఈ మధ్యనే సోషల్ మీడియాకు దూరంగా ఉండే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సైతం ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి పవన్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్త ఉదయం నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతం ట్విట్టర్ హ్యాండిల్ మాత్రమే ఉంది.
Dulquer Salmaan: దుల్కర్ కు ఏమైంది.. అలాంటి వీడియో ఎందుకు పోస్ట్ చేశాడు.. ?
పవన్ పర్సనల్ అకౌంట్ కాకుండా జనసేన పార్టీ పేరుతో ఒక అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. కానీ, పవన్ చాలా వ్యక్తిగతం అయితేనే ఆయన పర్సనల్ అకౌంట్ లో ట్వీట్ చేస్తాడు. ఇప్పటివరకు పవన్ కు ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ లేదు. అయితే త్వరలోనే పవన్ ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెడుతున్నట్లు అభిమానులు చెప్పుకొస్తున్నారు. చెప్పుకురావడం కాదు రచ్చ చేస్తున్నారు. ఆయన పేరుతో ఉన్న అకౌంట్స్ కే లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఆయన ఆఫీషియల్ అకౌంట్ అని తెలిస్తే కోట్లలోనే ఫాలోవర్లు వచ్చేస్తారు. ఇక పవన్ అఫిషియల్ ఇన్స్టాగ్రామ్ ఎంట్రీ త్వరలోనే ఉండనున్నదట. మొదటి పోస్ట్ గా పవన్.. జనసేన జెండాను కానీ, టీ గ్లాస్ ను కానీ పోస్ట్ చేసే అవకాశం ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ లో పవర్ స్ట్రోమ్ అడుగుపెడితే.. ఈ రేంజ్ లో ఉంటుందో చూడాలంటేకొన్ని రోజులు ఆగాల్సిందే.