Suriya: కదన రంగంలో ‘కంగువ’.. యుద్ధ వీరుడు ఇలా ఉండాలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అనే పేరు తలచుకోగానే ఎన్నో విభిన్న సినిమాలు గుర్తుకొస్తాయి. ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉంటాడు సూర్య. కమర్షియల్ సినిమాలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా చెయ్యడం సూర్య లాంటి స్టార్ హీరోకి మాత్రమే సాధ్యం అయ్యింది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో మంచి జోష్ లో ఉన్న సూర్య ఈసారి ఏకంగా పది భాషల్లో బాక్సాఫీస్ యుద్దం చేయడానికి రెడీ అవుతున్నాడు. సూర్య లేటెస్ట్ ఫిల్మ్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సూర్య చేస్తున్న 42వ సినిమాగా అతని కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో, పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ‘కంగువ’ అనే టైటిల్‌ను ఇటీవలే ఫిక్స్ చేశారు. ఇప్పటికే కంగువ టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తున్న కంగువా సినిమాని నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Also: The Kerala Story: వివాదాస్పదం అంటూనే వంద కోట్లు ఇచ్చారు…
Also Read
- Irumudi : 'ఇరుముడి' అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
- Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
- Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
ప్రస్తుతం కంగువ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం సూర్య మేకోవర్ చూస్తే ఔరా అనాల్సిందే. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కండలు తిరిగిన దేహంతో.. యుద్ధానికి సిద్దమవుతున్న వీరుడిలా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు సూర్య. ఎప్పుడూ ఫిట్ గానే ఉండే సూర్య, కంగువ కోసం వెయిట్ పెరిగి బల్కీ షేప్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సూర్య ఎక్స్సర్సైజ్ చేస్తున్న ఒక్క ఫోటో బయటకి రాగానే ఫాన్స్ దాన్ని వైరల్ చేస్తున్నారు, ఇది చూస్తే కంగువ సినిమా కోసం సూర్య ఎంతలా మారిపోయాడో తెలుస్తుంది. తమ అభిమాన హీరోని బీస్ట్ మోడ్‌లో చూసి పండగ చేసుకుంటున్నారు సూర్య అభిమానులు. రోజు రోజుకి కంగువ మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!