కంగువాతో ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈసారి కాలరెగరేసే మూవీని ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేసిన రెట్రోతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. బాక్సాఫీస్ లెక్కలు కూడా సరిచేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు సూర్య. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. రెట్రో ప్రపంచ వ్యాప్తంగా మే 1నరిలీజ్ కాబోతుంది రెట్రో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 18న చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. సూపర్ స్టార్ రజనీకాంత్‌ను చీఫ్ గెస్టుగా ఇన్వైట్ చేశారన్నది తమిళ సర్కిల్స్‌లో బజ్ నడుస్తోంది. అప్పుడే ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. రెట్రోకు సంతోష్ నారాయణన్ బాణీలు సమకూరుస్తున్నాడు.
Also Read : KritiSanon : పొడుగు కాళ్ళ సుందరి.. పాల బుగ్గల చిన్నది..
గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న రెట్రోను స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2D ఎంటర్టైన్మెంట్ పతాకాలపై కార్తీక్ సుబ్బరాజు, సూర్య, జ్యోతిక, కార్తీకేయన్ సంతానం నిర్మిస్తున్నారు. సుమారు 65 కోట్లతో నిర్మిస్తున్న రెట్రో డిజిటల్, టెలివిజన్ రైట్స్ సర్ ప్రైజింగ్ రేటుకు సోల్డ్ అయ్యాయన్నది కోలీవుడ్ టాక్. 80 కోట్ల వెచ్చించి ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సన్ టీవీ బ్రాడ్ కాస్ట్ రైట్స్ భారీ మొత్తానికి కొన్నట్లు సమాచారం. రీసెంట్లీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సూర్య లుక్స్ సినిమాపై అంచనాలు తారాస్థాయికి తీసుకెళుతున్నాయి. ప్రజెంట్ ఫెయిల్యూర్స్‌తో సతమతమౌతున్న సూర్య, పూజా హెగ్డేలకు ఈ సినిమా హిట్ అత్యంత కీలకం. మరీ ఈ ఇద్దరికి కార్తీక్ సుబ్బరాజు హిట్టిస్తాడో లేదో చూడాలి.