బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్.. బేధియా తర్వాత హిట్టు మొహమే చూడలేదు. బవాల్ ఓటీటీకి పరిమితం కాగా, ఆపై చేసినవన్నీ క్యామియోస్. రాకీ ఔర్ రాణీ ప్రేమ్ కహానీ, ముంజ్యా, స్త్రీ2లో స్పెషల్ రోల్‌లో మెరిశాడు. ఇక సౌత్ ఇండియన్ స్టోరీ తేరీ రీమేక్ బేబీ జాన్ చేసి చేతులు కాల్చుకున్నాడు వరుణ్. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ప్రజెంట్ సన్నీ సంస్కారీకి తులసి కుమారీ, హై జవానీ తో ఇష్క్ హోనా హై, బోర్డర్ 2 చేస్తున్నాడు.
Also Read : SAI : టాలీవుడ్‌పై కాన్సట్రేషన్ చేస్తోన్న ప్లాప్ బ్యూటీ
ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దింపి డౌన్ అయిన కెరీర్ గ్రాఫ్ పెంచుకోవాలని వరుణ్ భావిస్తే ఆ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. సన్నీ సంస్కారీకి తులసి కుమారీ పోస్ట్ పోన్ అయ్యింది. ఏప్రిల్ 18 నుండి ఏకంగా సెప్టెంబర్ 12కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై లవ్ అండ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది ఈ మూవీ. బవాల్ తర్వాత జాన్వీతో సెకండ్ టైమ్ జోడీ కడుతున్నాడు వరుణ్. విడుదల వాయిదా పై క్లారిటీ ఇవ్వలేదు కానీ ఐపీఎల్ ఎఫెక్ట్‌తో పాటు షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు ఇన్నర్ టాక్. సినిమాకు మరింత మెరుగులు దిద్దాలనుకుంటున్నాడట దర్శకుడు శశాంక్ ఖైతాన్. సన్నీ సంస్కారీకి తులసీ కుమారీ రిలీజ్ పోస్ట్ పోన్ ఎఫెక్ట్ వరుణ్ నెక్ట్స్ మూవీ హై జవానీ తో ఇష్క్ హోనా హై పై పడేట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాను అక్టోబర్ 2న అంటే దసరా ఫెస్టివల్‌ను టార్గెట్ గా తీసుకురావాలనుకున్నారు. ఇప్పుడు సన్నీ సంస్కారీకి తులసి కుమారీ సెప్టెంబర్‌కు వస్తే
ఈ మూవీ వాయిదా పడుతుందని అంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. బేబీ జాన్ రిజల్ట్ నుండి వీలైనంత తర్వగా బయటపదామనుకుంటున్న వరుణ్ ధావన్ కు ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితి..