Sunny Leone: ఇండస్ట్రీలో సన్నిలియోన్ గురించి తెలియని వారు ఉండరు. తెలుగులో కూడా అమ్మడు ఐటెం సాంగ్స్ తో అలరించింది. కరెంట్ తీగ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సన్నీ ఆ తర్వాత గరుడవేగ, మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలో కనిపించింది. ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ఉన్నా కూడా ఇప్పుడు బాలీవుడ్ లో చక్కని ప్రతిభ కనబరుస్తూ మంచినటి గా పేరు తెచ్చుకుంటుంది. ప్రస్తుతం సన్నీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇకపోతే సన్నీ ప్రస్తుతం తన భర్త డేనియల్ వెబర్ దుబాయిలో వెకేషన్ లో ఉంది.తాజాగా సన్నీ తన భర్త మోసం చేశాడంటూ సడన్ షాక్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. నా భర్త నన్ను మోసం చేశాడు అంటూ రాసుకు వచ్చింది. అయితే సడన్ గా ఆ క్యాప్షన్ చూసిన అభిమానులు షాక్ అయ్యారు.
Naga Chaitanya: నాగచైతన్య మరోసారి విడాకులు.. ఈసారి.. ?
ఇక అంతగా తన భర్త ఏం చేశాడు అంటూ వీడియో క్లిక్ చేసి చూసి ఆశ్చర్యపోయారు. అందులో డేనియల్ అర్ధరాత్రి ఫ్రిజ్ దగ్గర ఐస్ క్రీమ్ తింటూ కనిపించాడు. తన భర్త తనకు తెలియకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడంటూ సన్నీ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన భర్త చాటుగా ఐస్ క్రీమ్ తినడాన్ని ఒక వీడియోగా తీసి ఇన్స్టా లో పోస్ట్ చేసింది. దీనికి “నా భర్త నన్ను మోసం చేస్తున్నప్పుడు” అంటూ రాసుకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అవును నిజంగానే డేనియల్ నిన్ను మోసం చేస్తున్నాడు తనకి పనిష్మెంట్ ఇవ్వు అంటూ అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు సూపర్ కపుల్ అంటూ పొగిడేస్తున్నారు.