Naga Chaitanya: అక్కినేని హీరోలు ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకపక్క నాగార్జున సినిమాలు మానేసి బిగ్ బాస్ కి హోస్టుగా మారిపోయాడు. ఇంకోపక్క అఖిల్.. ఏజెంట్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకొని ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నాడు. ఇక కాస్త కూస్తో అక్కినేని నాగచైతన్య మాత్రమే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇండస్ట్రీ మొత్తం పాన్ ఇండియా, పాన్ ఇండియా అంటూ దూసుకుపోతుంటే కేవలం అక్కినేని హీరోలు మాత్రమే ఇప్పటివరకు పాన్ ఇండియా రేంజ్ సినిమా కాదుకదా ఒక మంచి హిట్టును అందుకోలేకపోయారు. దీంతో అక్కినేని అభిమానులు కూసింత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య తన సినిమాలను పాన్ ఇండియావరకు తీసుకెళ్లకపోయినా.. కనీసం హిట్ అయిన అందుకునేలా చేయాలని కష్టపడుతున్నాడు. ఇప్పటికే దూత వెబ్ సిరీస్ ను ఫినిష్ చేసిన చై ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కాకుండా చై సామజవరగమన డైరెక్టర్ రామ అబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి అయితే అది నిజమని తెలుస్తుందే.
BabyTheMovie: ఇందూకు చెల్లి దొరికిందిరోయ్.. అలా అయితే పాప పరిస్థితి కష్టమేరోయ్
ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథ విడాకుల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే రామ్, చైతుకి కథ వినిపించాడని.. ఆ కథ అతనికి బాగా నచ్చిందని, కాకపోతే కొన్ని కరెక్షన్స్ ఉండడంతో అవి చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఆ కరెక్షన్స్ పూర్తి చేసి మరోసారి చైతుకి వినిపించనున్నాడట రామ్. ఒకవేళ ఫైనల్ స్క్రిప్ట్ కనుక ఓకే అయితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. విడాకుల నేపథ్యం అనగానే చై ఒరిజినల్ స్టోరీ గుర్తుకు తెచ్చేస్తారు అభిమానులు. సమంత, నాగచైతన్య ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. అయితే నాలుగేళ్లు కలిసి ఉన్న ఈ జంట కొన్ని విభేదాల కారణంగా విడిపోయారు. దీంతో ఇండస్ట్రీలో ఏ విడాకుల టాపిక్ వచ్చినా వీరిద్దరు విడాకులు టాపిక్ హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ఇలాంటి హాట్ టాపిక్ మీద చై సినిమా చేయడం అంటే రిస్క్ అనే చెప్పాలి. అయినా కూడా చై ఈ సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం. మరి ఈ చిత్రాలతో ఈ అక్కినేని హీరో ఈసారైనా విజయాన్ని అందుకుంటాడా..? లేదా అనేది చూడాలి.