Sunil: సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చేవారిలో చాలామంది ఒకటి అవ్వాలని వస్తారు.. ఇంకొకటి అవుతారు. సునీల్.. కమెడియన్ గా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదట సునీల్.. విలన్ అవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కానీ, అనుకోకుండా కమెడియన్ గా మారాడు. స్టార్ కమెడియన్ గా మంచి ఫార్మ్ లో ఉన్నప్పుడే హీరో అవ్వాలని అడుగు ముందుకు వేసి తడబడ్డాడు. ఆ తప్పిదం.. ఎన్నో ఏళ్లు సునీల్ ను ఇండస్ట్రీకి దూరం చేసింది. తప్పు తెలుసుకున్నవాడే మహానుభావుడు అన్నట్లు.. సునీల్ కూడా తనలో ఉన్న సత్తాను మరోసారి బయటపెట్టాడు. ఈసారి మొదట చేసిన తప్పు చేయకుండా అటు కమెడియన్ గా కాకుండా.. ఇటు హీరోగా కాకుండా విలన్ గా మారాడు. పుష్ప లో సునీల్ విలనిజానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
Tasty Teja: బిగ్ బాస్ హోస్ట్ నే ఇంటర్వ్యూ చేశావా తేజ..
ఒకప్పుడు ప్రేక్షకులు ఏ ఫేస్ చూసి అయితే నవ్వారో.. ఇప్పుడు అదే ఫేస్ చూసి భయపడుతున్నారు. అంతలా సునీల్ క్యారెక్టర్స్ లో జీవిస్తున్నాడు. ముఖ్యంగా తమిళ్ స్టార్ హీరోలకు విలన్ అంటే సునీల్ అనేంతలా ఎదిగాడు. రజినీకాంత్ జైలర్ సినిమాలో కామెడీ విలన్ గా అయినా నటించి మెప్పించాడు. ఇక తాజాగా మరో హీరోకు సునీల్ విలన్ గా మారాడు. నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం హరోంహర. జ్ఞానసాగర్ దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సునీల్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పళని సామీ పాత్రలో సునీల్ నటిస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్ లో సునీల్ లుక్ పేరుకు తగ్గట్టే తమిళ్ తంబీల కనిపిస్తుంది. పక్కన గన్, బులెట్స్ చూపించి.. సునీల్ కు పవర్ పెంచేశారు. పీరియాడికల్ యాక్షన్-డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాతో సునీల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.