Tasty Teja: బిగ్ బాస్ హోస్ట్ నే ఇంటర్వ్యూ చేశావా తేజ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tasty Teja: టేస్టీ తేజ.. గత కొన్ని రోజులుగా ఈ పేరు అందరికీ బాగా తెలుసు. జబర్దస్త్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇంకోపక్క యూట్యూబ్లో ఫుడ్ బ్లాగ్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే నేపథ్యంతో బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. అక్కడ కూడా శైలిలో కామెడీ పంచుతూ దాదాపు 9 వారాలు ఇంట్లో కొనసాగాడు. ఇక తొమ్మిదో వారంలో తేజ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడు. ఒక సాధారణమైన ఫుడ్ బ్లాగ్ నిర్వహించే తనను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకెళ్లినంత అభిమానాన్ని ఇచ్చిన అభిమానులకు థాంక్స్ చెప్పాడు. తాను ఎక్కడికి వెళ్లినా కూడా తనను ఇక్కడవరకు తీసుకొచ్చిన ఫుడ్ బ్లాగ్స్ ను వదలను అంటూ చెప్పుకొచ్చిన తేజ తన మాటను నిలబెట్టుకున్నాడు బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక మొట్టమొదటి ఫుడ్ బ్లాగ్ చేశాడు. అదికూడా హీరో నానితో చేయడం విశేషం.
NTR: అయ్యబాబోయ్.. ఏమున్నాడ్రా బాబు..
Also Read
ప్రస్తుతం నాని హాయ్ నాన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు డిసెంబర్ 7న ఈ సినిమా రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన నాని తాజాగా టేస్టీ తేజతో కలిసి ఫుడ్ బ్లాగ్ చేశాడు. ఇందులో సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు బిగ్ బాస్ కు సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకున్నారని సమాచారం. ఎందుకంటే నాని బిగ్ బాస్ సీజన్ 2 కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎన్టీఆర్ తర్వాత నాని హోస్ట్ గా వ్యవహరించి సెన్సేషన్ సృష్టించాడు. దీంతో బిగ్ బాస్ హోస్ట్ నే ఇంటర్వ్యూ చేస్తున్నావా తేజ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా నానికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Our Natural 🌟@NameIsNani garu is adding a dash of flavor to our #HiNanna promotions with #TastyTeja 😀
An entertaining fun-filled episode is coming your way! ❤️
Releasing Worldwide on DEC 7th, 2023 💥#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa@Mrunal0801 @shouryuv #BabyKiara… pic.twitter.com/XpZIDJVmX9
— Vyra Entertainments (@VyraEnts) November 10, 2023
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?