Navadeep: జై సినిమాతో తెలుగుతెరకు పరిచయామయ్యాడు నవదీప్. మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలిచాడు పిల్లికళ్ల చిన్నోడు. ఆతరువాత కొన్ని మంచి మంచి సినిమాల్లో కనిపించి మెప్పించాడు. బిగ్ బాస్ కు వెళ్లి బుల్లితెర అభిమానులను కూడా తనవైపు తిప్పుకున్నాడు. ఇక ప్రస్తుతం ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క సిరీస్ లతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సిరీస్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. నవదీప్.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్. ఆయన కెరీర్ లో చాలా వివాదాలు ఉన్నాయి, డ్రంక్ డ్రైవ్ లో దొరకడం, ఆయన నడిపిస్తున్న పబ్ లో డ్రగ్స్ దొరకడం..అందులో నవదీప్ పాత్ర కూడా ఉందని చెప్పడం.. ఇక ఇండస్ట్రీలో అతను గే అని రూమర్స్.. ఇలా ఒకదాని తరువాత ఒకటి నవదీప్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. తాజాగా వీటన్నింటికి ఈ హీరో ఒక ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పాడు.
పెళ్ళికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించిన స్టార్స్ వీరే..
మీడియా అంటే.. జరిగింది చెప్తే ఎవరు చదువుతారు అని.. జరిగినదానికి ముందు ఏం జరిగిందో ఉహించుకొని డ్రామా చేయడమే అంటూ చెప్పుకొచ్చాడు. తన మీద చాలా రూమర్స్ వచ్చాయి.. ఆరోపణలు వచ్చాయి. తప్పు చేస్తే.. నేను తప్పు చేశాను.. ఇంకోసారి చేయను అని చెప్పేస్తాను.. కానీ, నా తప్పు లేనప్పుడు కూడా అంటే బాధగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇక తన మీద బ్రేకింగ్ న్యూస్ లు వేయాలంటే.. టెర్రరిస్టులకు దారి చూపిస్తున్న హీరో నవదీప్.. తన క్లబ్ లో స్పెషల్ రేవ్ పార్టీస్ చేస్తున్న నవదీప్ అని చెప్పుకొచ్చాడు. ఇక స్టార్ల గురించ బ్రేకింగ్ న్యూస్ చెప్పాలంటే.. తేజ.. ఈ యాక్టర్ ను కొట్టకుండా షూటింగ్ ఫినిష్ చేసిన తేజగారు. సుకుమార్ .. మొట్టమొదటిసారిగా షూటింగ్ చరిత్రలో 48 గంటలు ప్యాకప్ చెప్పకుండా చేసిన డైరెక్టర్ సుకుమార్ గారు. అల్లు అర్జున్.. ‘మిషన్ ఇంపాజిబుల్ 7’లో టామ్ క్రూజ్ ను రీప్లేస్ చేసిన అల్లు అర్జున్ అని సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ మాట విన్న బన్నీ ఫ్యాన్స్.. అంటే అన్నాడు కానీ.. ఆ ఊహ ఎంత బావుందో అని మురిసిపోతున్నారు.