క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన “ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో సుకుమార్ మాట్లాడుతూ తన ఫేవరేట్ హీరోయిన్, హీరో ఎవరో వెల్లడించారు. తన ఫేవరెట్ హీరోయిన్ సుమ అంటూ సెటైర్ పేల్చిన సుకుమార్… శర్వా తనకు ఇష్టమైన నటుడు అని అన్నారు. ఇక తన శ్రీవల్లి రష్మికనూ వదల్లేదు. నీ పేరేంటి ? అంటూ సరదాగా రష్మిక పేరును మర్చిపోయినట్టు యాక్ట్ చేశారు. ఇక రష్మిక, సాయి పల్లవి, కీర్తి సురేష్… ఈ గ్యాంగ్ లో గ్యాంగ్ లీడర్ సమంత మిస్ అయ్యిందని, ఈ నలుగురు హీరోయిన్లూ ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్నారని కితాబునిచ్చారు. ఆ తరువాత “ఆడవాళ్లు మీకు జోహార్లు” మీకు హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తూ చిత్రబృందాన్ని విష్ చేశారు సుకుమార్.
Read Also : Sukumar : లేడీ పవర్ స్టార్… హీరోయిన్ ను ఆకాశానికెత్తేసిన డైరెక్టర్