Jayam Ravi : తమిళ హీరో జయంరవి కుటుంబ గొడవలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. ఇప్పటికే జయం రవి వరుసగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అటు ఆయన భార్య ఆర్తి కూడా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్తి తల్లి, జయం రవి అత్త అయిన ప్రొడ్యూసర్ సుజాత విజయ్ కుమార్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంటున్న ఆమె.. తాజాగా జయం రవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జయం రవి వల్లే తాను ఇండస్ట్రీలోకి వచ్చినట్టు ఆమె చెప్పుకొచ్చారు. అతని వల్లే నిర్మాతగా మారనని స్పష్టం చేశారు.
Read Also : AjithKumar : అజిత్ సంచలన నిర్ణయం.. సినిమాలకు బ్రేక్..
‘జయం రవి నాకు మొదట్లో చాలా సపోర్ట్ చేశారు. నిర్మాతగా మారిన తర్వాత కొన్ని సినిమాలు చేశాను. వాటి తర్వాత జయం రవితో వరుసగా సినిమాలు చేశాను. రవితో చేసిన సినిమాల కోసం నేను ఫైనాన్షియర్ల దగ్గరి నుంచి రూ.100 కోట్ల దాకా అప్పులు చేశాను. అందులో 25 శాతం వరకు అతనికే రెమ్యునరేషన్ కింద ఇచ్చాను. నష్టాలు వచ్చినా కనీసం పట్టించుకోలేదు.
నష్టాలు తీర్చడానికి నా బ్యానర్ లోనే మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు. కానీ చేయలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాను అని కూడా చెప్పలేదు. అప్పులకు వడ్డీలు నేను ఒక్కదాన్నే కడుతున్నాను. అప్పుల వల్ల ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. జయం రవి చెబుతున్నవి చాలా వరకు అబద్ధాలే. అతని మీద గౌరవం పోతోంది’ అంటూ చెప్పుకొచ్చింది. మరి అత్త చేసిన ఆరోపణలపై జయం రవి ఏమైనా స్పందిస్తాడా లేదా అన్నది చూడాలి. జయం రవి గతేడాది తన భార్య ఆర్తితో విడిపోతున్నట్టు ప్రకటించాడు. కానీ తనకు ఇష్టం లేకుండానే విడాకులు కావాలంటున్నాడంటూ ఆర్తి కోర్టుకు ఎక్కింది. వీరిద్దరి కేసు ఇప్పుడు కోర్టులో నడుస్తోంది.
Read Also : Heart attack : పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలి వ్యక్తి మృతి..