AjithKumar : తమిళ స్టార్ హీరో అజిత్ మల్టీ ట్యాలెంటెడ్ అని తెలిసిందే. ఆయన సినిమాలతో పాటు కార్ రేసింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎక్కడ కార్ రేసింగ్ జరిగినా సరే అజిత్ పాల్గొంటారు. మొన్న లండన్ తో పాటు బ్రెజిల్ లో కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే అజిత్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి కార్ రేసింగ్ లో పాల్గొంటాడు అనే టాక్ నడుస్తోంది. దీనిపై తాజాగా అజిత్ స్పందించాడు. తనకు సినిమాలతో పాటు కార్ రేసింగ్ రెండు సమానమే అన్నారు.
Read Also : UP: భార్యతో గొడవ, నదిలోకి దూకి భర్త ఆత్మహత్య..
‘కార్ రేసింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడ జరిగినా పాల్గొంటాను. దాని కోసం ఎంతో మార్చుకున్నాను. గత 8 నెలల్లో దాదాపు 42 కిలోలు తగ్గాను. కార్ రేసింగ్ కోసం చాలా ఫిట్ గా ఉండాలి. రేస్ ఉన్న ప్రతిసారి డైట్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతా. జిమ్, వ్యాయామాలు చేస్తాను. కానీ రేసింగ్ ఉన్న టైమ్ లో సినిమాలకు న్యాయం చేయలేకపోతున్నాను. అందుకే కార్ రేసింగ్ ఉన్న సమయంలో సినిమాలకు బ్రేక్ ఇస్తాను. సినిమాలకు నేను కచ్చితంగా ఉండాలి అనుకున్నప్పుడు కార్ రేసింగ్ కు బ్రేక్ ఇస్తాను.
రెండూ ఒకేసారి పెట్టుకోను. అలా చేస్తే ఏదో ఒక దానికి అన్యాయం చేసినట్టే అవుతుంది. సినిమాలే నన్ను ఈ స్థాయికి తెచ్చాయి. వాటిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కార్ రేసింగ్ అనేది నా సంతోషం. అది ఫైనల్ అని కాదు. ఎప్పుడూ ఒకేలా ఉండటం నాకు నచ్చదు. నా అభిరుచికి తగ్గట్టు జీవించాలని నాకు ఉంటుంది’ అంటూ తెలిపారు అజిత్.
Read Also : అబ్బా.. హాట్ అందాలతో కాకరేపుతున్న రుహాణి శర్మ