Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వర్సటైల్ యాక్టింగ్‌తో దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ సరికొత్త ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్న మోస్ట్ అవేటెడ్ కోలీవుడ్-టాలీవుడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘మండాడి’. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రంలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ **సూరి**, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ‘ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్’ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి హీరో సుహాస్ క్యారెక్టర్‌కు సంబంధించిన పవర్ఫుల్ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో సుహాస్ మేకోవర్, రస్టిక్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
సముద్ర తీరప్రాంతం, మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఈ సినిమాను దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో రియల్ లొకేషన్స్‌లో ఎంతో నేచురల్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాలో సుహాస్, సూరి ఇద్దరూ మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత పవర్ఫుల్ లుక్‌లో కనిపించనున్నారు. ముఖ్యంగా తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో.. సుహాస్ చేతిలో కత్తి పట్టుకుని నడుచుకుంటూ వస్తుంటే థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయం అనేలా ఉంది. ఈ చిత్రంలో సుహాస్ ‘సాట్టపులి’ అనే ఒక పవర్ఫుల్ అండ్ నెవ్వర్ బిఫోర్ క్యారెక్టర్లో మెప్పించబోతున్నారు.
Also Read
- Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్‌ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
- Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
- The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న 'ది ఇండియా స్టోరీ' టీజర్
- Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
ఈ సినిమాలో సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే బోట్ యాక్షన్ సీక్వెన్స్, హై-వోల్టేజ్ ఫైట్స్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ యాక్షన్ సీన్స్‌ను స్టార్ ఫైట్ మాస్టర్స్ పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, మ్యూజిక్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుహాస్ సరసన మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
-
Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
-
Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్‌కు వెళ్లాలా.?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!