Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Babu: పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న వేళ చిత్ర యూనిట్ నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వేదికలపై గంభీరంగా మాట్లాడిన మోహన్ బాబు, ఈ చిత్రంలో తన పాత్ర ఎంపిక దగ్గర నుంచి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీరు వరకు పలు ఆసక్తికర, అంతర్గత విషయాలను మీడియా ముఖంగా వెల్లడించారు. ‘ది ప్యారడైజ్’ ప్రాజెక్ట్‌లోకి తాను ఎలా వచ్చానో వివరిస్తూ మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఈవెంట్‌లోని వారందరిని ఆశ్చర్యపరిచాయి. “రాజా రవీంద్ర చెబితే శ్రీకాంత్ ఓదెలను తిరుపతిలోని మా యూనివర్సిటీకి రమ్మన్నాను. వచ్చి కూర్చుని నాతో కథ చెప్పడం మొదలుపెట్టాడు. కథ లైన్ విన్న తర్వాత.. ‘ఏమయ్యా నువ్వు కథ చెప్తున్నావు, ఈ చిత్రానికి నాని కదా హీరో.. నానిని అడిగావా?’ అని నేను అడిగాను. దానికి శ్రీకాంత్ ‘మా అన్న పర్మిషన్ తీసుకొనే వచ్చాను’ అన్నాడు. అప్పుడు నా ఈగో కొట్టింది. ‘నన్ను ఈ సినిమాలో పెట్టుకోవడానికి నాని పర్మిషన్ తీసుకుని వచ్చావా?’ అని నా మనసులో అనిపించింది. నేను గట్టిగా మాట్లాడితే కంగారుపడతాడేమోనని బయటపడలేదు. కానీ అతను భయం లేకుండా ఉన్నదున్నట్లు ధైర్యంగా చెప్పాడు” అంటూ ఆ సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.
55 ఏళ్ల కెరీర్లో ఇంత భయంకరమైన పాత్ర చేయలేదు
తన సినీ జీవితంలో 500కు పైగా చిత్రాలు చేసినప్పటికీ, ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదని మోహన్ బాబు పేర్కొన్నారు. నన్ను అంత ఘోరంగా చూపిస్తారనుకోలేదని అన్నారు. “దాదాపు 55 ఏళ్ల నా సినీ జీవితంలో, 500కు పైగా సినిమాల్లో ఎన్నో రకాల విలన్ పాత్రలు చేశాను. కానీ ఇంత భయంకరమైన పాత్రను చేయడం నా లైఫ్‌లోనే ఫస్ట్ టైమ్. ఇంత క్రూరంగా చూపిస్తాడని ముందే తెలిస్తే అసలు ఈ సినిమా ఒప్పుకునేవాడినే కాదు. రోట్లో తలదూర్చాక రోకటి పోటుకు వెరవకూడదని తెలిసి కమిట్ అయ్యాను” అని అన్నారు. “డైలాగ్ చెప్పేటప్పుడు కళ్లు ఎర్రగా చేయాలి, మధ్యలో చిన్నవి చేయాలి, చివర్లో రౌద్రం చూపించాలి అంటూ నాతో 10 టేకులు తీయించేవాడు. నా జీవితంలోనే నాతో అత్యధిక టేకులు తీసుకున్న ఏకైక దర్శకుడు శ్రీకాంత్. దాసరి నారాయణరావు గారు కూడా నాతో ఇలాగే తీయించేవారు. శ్రీకాంత్ ఆర్డినరీ డైరెక్టర్ కాదు, భవిష్యత్తులో దేశంలోనే నెంబర్ వన్ అవుతాడు. కానీ నాకు మళ్లీ అవకాశం ఇస్తే మాత్రం ఇలాంటి పాత్ర ఇవ్వొద్దు” అని నవ్వుతూ చెప్పారు.
Also Read
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
- Srikanth Odela: "అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!"
“సెట్లో గొడవలు జరిగితే మీకెందుకురా?”..
హీరో-దర్శకుడి మధ్య విభేదాలు, నెగెటివ్ ప్రచారంపై మోహన్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “సెట్లో డైరెక్టర్ కొట్టాడు, తిట్టాడు అని బయట ప్రచారం చేస్తున్నారు. సెట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి మీరెవరురా? నీకెందుకురా అడగడానికి? ఒక పని చేస్తున్నప్పుడు సెట్లో వంద జరుగుతాయి. వాటన్నింటికీ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు” అని కుండ బద్దలు కొట్టారు. “నాని పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. జడలు వేసుకుని ఆ లుక్‌తో నటించడం సాధారణ విషయం కాదు. నాతో బేర్ బాడీ ఫైట్ చేశాడు. నానిలో డ్యాన్స్ మాత్రమే కాదు, గొప్ప నటుడు ఉన్నాడు. అతని నటన చూసి ఒక సీనియర్ ఆర్టిస్ట్‌గా నేను గర్వపడుతున్నాను” అని ప్రశంసించారు. దివంగత ప్రజాకవి గద్దర్ తనకు తమ్ముడి లాంటి వాడని గుర్తుచేసుకున్న మోహన్ బాబు, సభలో మాట్లాడిన ఒక దివంగత రచయిత కుమారుడు కబీర్ ఎం.ఫార్మసీ చదువుతున్నాడని తెలుసుకుని వెంటనే స్పందించారు. తమ యూనివర్సిటీలో రెండేళ్ల పాటు అతనికి ఉచిత విద్యతో పాటు హాస్టల్ వసతిని కల్పిస్తున్నట్లు అక్కడికక్కడే వేదికపైనే ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. సినిమా ఫలితంపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాము లెక్కచేయబోమని, ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే ఘన విజయాన్ని సాధించిందని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
-
Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
-
Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?