Sudheer: సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుధీర్ నటించిన గాలోడు చిత్రం నేడు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకొంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సుధీర్, రష్మీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఎప్పటినుంచో ఈ జంట ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ఈ నేపథ్యంలో సుధీర్ ఈ వార్తలపై స్పందించాడు. అదంతా ఆన్ స్క్రీన్ రొమాన్స్ మాత్రమే అని, పెళ్లి చేసుకొనే ఆలోచన అస్సలు లేదని చెప్పుకొచ్చాడు.
ఇక మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బావుంటుందని చెప్పగా..ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే తనకు అంతగా ఇష్టం ఉండదని, తాను, రష్మీ ఒకరినొకరు పట్టుకోమని, ముట్టుకోమని ఆ రీజన్ వల్లే మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెప్పుకొచ్చాడు. తమ కళ్ళతోనే ఎక్స్ ప్రెషన్స్ పలికించడంతో ఆ లవ్ ఫీల్ వస్తుందని చెప్పుకొచ్చాడు. రష్మీనే కాదు తాను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోనని, జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక ఈ వ్యాఖ్యలు విన్న సుధీర్- రష్మీ ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.