స్టార్ సింగర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్నో కలలు కన్న వారి కలలు కల్లలు అయ్యాయి. పదినెలలుగా ఇంట్లోకి కొత్త అతిధి వస్తున్నాడు అని ఎదురుచూసిన ఆ చూపులకు నిరాశే మిగిలింది. స్టార్ సింగర్ బిడ్డ..తల్లి పొత్తిళ్లలోనే కన్నుమూసింది. ఈ ఘటన బాలీవుడ్ లో ప్రస్తుతం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. స్టార్ సింగర్ బిప్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్, స్టేజి షో లలో అతడి సాంగ్స్ సూపర్ ఫేమస్ అయ్యాయి. తెలుగులో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో సూర్యుడివో చంద్రుడివో అనే హిట్ సాంగ్ ను పడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బిప్రాక్ కొన్నేళ్ల క్రితం మీరాను వివాహమాడాడు. అయితే ఈ జంట ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిపి అభిమానులను ఆనందపరిచారు. దీంతో అభిమానులు త్వరగా మీరా బిడ్డను కనాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా అనూహ్యంగా మీరా జన్మనిచ్చిన నవజాత శిశువు పుట్టిన కొద్దిక్షణాల్లోనే మృతి చెందాడు. దీంతో నవ్వులు పూయాల్సిన ఆ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. 10 నెలలు మోసి కనిన బిడ్డ క్షణాల్లోనే కన్ను మూయడంతో మీరా కన్నీటి పర్యంతమయ్యింది. ఇక ఈ బాధాకరమైన విషయాన్నీ బిప్రాక్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ” నవజాత శిశువు పుట్టిన సమయంలోనే మరణించిందని ఎంతో బాధపడుతున్నాం. ఇది తల్లిదండ్రులుగా మేము భరించలేని ఒక దశ. తమవంతు ప్రయత్నం చేసిన వైద్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు సపోర్ట్ చేసినవారికి, అభిమానులకు ధన్యవాదాలు.. బిడ్డపోయిన బాధలో ఉన్న ఈ సమయంలో మా గోప్యతను మాకు అందించమని మేము మీ అందరిని అభ్యర్థిస్తున్నాము” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.