భానుమతి ఒక్కటే పీస్ అంటూ రియల్ లైఫ్‌లో కూడా అలాగే ఉండటానికి ట్రై చేస్తోంది సాయి పల్లవి. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నా కాదని కథ, ఆ కథలో తనకుండే ప్రాధాన్యతకు వెయిటేజ్ ఉంటేనే సినిమాలు చేస్తోంది ఈ ఫిదా గర్ల్. నంబర్ గేమ్‌ను అసలు పట్టించుకోని ఈ బ్యూటీ సౌత్‌లో యునిక్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అమరన్, తండేల్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు చూపించిన సాయి పల్లవి నెక్ట్స్ బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తోంది.
అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్‌తో ‘ఏక్ దిన్’ అనే సినిమా చేస్తోంది. నవంబర్ 7న రిలీజ్ డేట్ అని గతంలో ప్రకటించారు. కానీ సడెన్లీ ఈ సినిమా టైటిల్‌తో పాటు పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఛేంజస్ వెనుక అమీర్ ఖాన్ ఉన్నట్లు బాలీవుడ్ టాక్. ఏక్ దిన్ నేమ్ కాస్త ‘మేరీరహోగా’ టైటిల్ మార్చి సినిమాను నవంబర్ నుండి డిసెంబర్ 12కి విడుదల తేదీ మార్చినట్లు సమాచారం. అంతేకాకుండా సడెన్లీ ఈ ప్రాజెక్టులోకి దూసుకొచ్చాడు మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా జాయినై ఇప్పుడు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కొడుకు ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని ఈ ఛేంజస్ చేస్తున్నాడట. 2011 కొరియన్ డ్రామా వన్ డే ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు బాలీవుడ్ బజ్. రొమాంటిక్ ఫిల్మ్‌గా తీసుకురాబోతున్నారు మేకర్స్. జునైద్ ఖాన్ లాంటి ప్లాప్ హీరోతో జోడీ కట్టడమంటే సాయి పల్లవి కెరీర్ రిస్క్ చేస్తున్నట్లే లెక్క. కానీ ఈ హిట్టేతే ఓకే కానీ.. తేడా కొడితే.. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణపై ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. అందులోనూ గ్లామర్ రోల్ చేస్తే. మరీ ఇప్పటి వరకు నో ఎక్స్ పోజింగ్ థీరిని ఫాలో అయిన సాయి పల్లవి.. ఇందులో బోర్డర్స్ క్రాస్ చేసిందా లేదా తేలాలంటే… సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయనక్కర్లేదు.. టీజరో, ట్రైలర్లోనే తేలిపోనుంది.